Nashik : భయంతో వణికిపోయిన పిల్లి, జాలి చూపిన చిరుత..వీడియో వైరల్

ఎదురెదురుగా పిల్లి - చిరుత. ఇక పిల్లి పని ఖతమే. చిరుత నోట్లో పిల్లి చిక్కినట్టే..దానికి ఆహారమయినట్లే..అని అనుకున్నారు అందరూ.

Nashik : భయంతో వణికిపోయిన పిల్లి, జాలి చూపిన చిరుత..వీడియో వైరల్

Nasik

Updated On : September 6, 2021 / 4:51 PM IST

A Leopard And A Cat : ఎదురెదురుగా పిల్లి – చిరుత. ఇక పిల్లి పని ఖతమే. చిరుత నోట్లో పిల్లి చిక్కినట్టే..దానికి ఆహారమయినట్లే..అని అనుకున్నారు అందరూ. కానీ…ఓ అద్భుతం జరిగిపోయింది. పిల్లికి ఏ మాత్రం హానీ తలపెట్టలేదు. ఆ చిన్న పిల్లిపై చిరుత జాలి చూపించింది. అప్యాయంగా దాని తల నిమిరింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read More : Viral Pic : పాము నవ్వడం చూశారా?అయితే చూడండీ..

నాసిక్ జిల్లాలో ఓ చిరుత పులి, పిల్లి…రెండూ లోతైన బావిలో పడిపోయాయి. నీళ్లలో పడిన..వెంటనే పిల్లి…గట్టుపైకి చేరింది. వెంటనే చిరుత కూడా…పైకి ఎక్కింది. దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దాని నుంచి కాపాడుకోవడానికి పిల్లి..ప్రయత్నించింది. కానీ..ఎటూ వెళ్లే దారి లేక నక్కి నక్కి కూర్చొంది. ఇక తన పని అయిపోయిందని పిల్లి భావించింది. భయంతో వణికిపోయింది.

Read More :EPFO : PF ఖాతాదారులకు తీపికబురు.. దీపావళి కల్లా అకౌంట్లలోకి డబ్బులు

రెండు కాళ్లపై నిలబడి..దండం పెట్టినంత పని చేసింది. ఒక్కసారిగా చిరుత మారిపోయింది. దానిని ఏమీ చేయవద్దని అనుకుంది. భయం భయంగా వణికిపోయిన పిల్లిని దగ్గరకు తీసుకుంది. రెండూ కాసేపు ఆటాడుకున్నాయి. ఫన్నీ..ఫన్నీగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.