Fire Accident: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం: తృటిలో తప్పిన పెను ముప్పు

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

Fire Accident: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం: తృటిలో తప్పిన పెను ముప్పు

Airport

Updated On : June 4, 2022 / 12:39 PM IST

Fire Accident: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రతినిధి తెలిపిన వివరాలు మేరకు..ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శుక్రవారం సాయంత్రం.. ఐదున్నర గంటల సమయంలో టోయింగ్ వాహనం (విమానాలను లాగే వాహనం)లో మంటలు చెలరేగాయి. వాహనంలో నుంచి భారీగా ఎగసిపడ్డ మంటలను గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది అప్రమత్తం అయి వెంటనే మంటలను అదుపు చేశారు.

Other Stories: Kind Parents: కుమారుడి చావుకు కారణమైన ట్యాక్సీ డ్రైవర్‌ని క్షమించిన తల్లిదండ్రులు: డ్రైవర్ జీవితమన్నా బాగుండాలని చివరకు అలా!

వాహనంలో సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగినట్టు అధికారులు గుర్తించారు. లాగుడు బండిలో మంటలు చెలరేగిన సమయంలో పక్కనే ఓ భారీ విమానం కూడా ఉంది. మంటల పక్కనే ఉన్న విమానానికి వ్యాపించి ఉంటే..ప్రమాద తీవ్రత పెరిగి ఉండేదని, సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పించగలిగామని ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఘటనపై ఎయిర్ పోర్ట్ రక్షణ విభాగ అధికారులు విచారణకు ఆదేశించారు.