Viral Video : నిశ్చితార్ధం జరుగుతుండగా దూసుకొచ్చిన అమ్మాయి.. నన్నే మోసం చేస్తావా అంటూ వధువుతో గొడవ.. ఆ తర్వాత..

అసలు విషయం తెలిశాక వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజం తెలుసుకున్న వరుడు బిత్తరపోయాడు.

Viral Video : నిశ్చితార్ధం జరుగుతుండగా దూసుకొచ్చిన అమ్మాయి.. నన్నే మోసం చేస్తావా అంటూ వధువుతో గొడవ.. ఆ తర్వాత..

Updated On : March 7, 2025 / 2:35 AM IST

Viral Video : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ లోని ఓ హోటల్ లో ఎంగేజ్ మెంట్ వేడుకలో షాకింగ్ ఘటన జరిగింది. ఎంగేజ్ మెంట్ వేడుక జరుగుతున్న సమయంలో సడెన్ గా ఓ అమ్మాయి దూసుకొచ్చింది. నేరుగా స్టేజ్ పైకి వెళ్లింది. అక్కడ వరుడు, వధువు కూర్చుని ఉన్నారు. వధువు దగ్గరికి వెళ్లిన ఆ అమ్మాయి గొడవకు దిగింది.

నన్నే మోసం చేస్తావా అంటూ నిలదీసింది. అంతేకాదు.. నాతో వచ్చేయ్, ఇద్దరం వెళ్లిపోదాం అంటూ బలవంతంగా వధువుని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఆ అమ్మాయి ఎవరు? పెళ్లి కూతురితో ఎందుకు గొడవ పడింది? బలవంతంగా లాకెళ్లే ప్రయత్నం ఎందుకు చేసింది? అని అంతా చర్చించుకోవడం మొదలు పెట్టారు. కాసేపటికి.. అసలు విషయం తెలిసి వరుడితో సహా అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. మ్యాటర్ ఏంటంటే.. వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారట. నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందట. ఇప్పుడు తనను మోసం చేసి, తనను కాదని ఓ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ రచ్చ రచ్చ చేసిందట ఆ యువతి.

Also Read : ఎంతకు తెగించారు.. విదేశీయులే టార్గెట్.. అమ్మాయిలను బెదిరించి.. హైదరాబాద్ లో దిమ్మతిరిగిపోయే భారీ స్కామ్..

గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ హోటల్ లో నిశితార్ధ వేడుక ఏర్పాటు చేశారు. వరుడు, వధువు కుటుంబసభ్యులు అక్కడికి తరలివచ్చారు. అంతా ఆనందంగా ఉన్నారు. వధువు, వరుడు స్టేజ్ పై కూర్చుని ఉన్నారు. ఇంతలోనే ఓ అమ్మాయి సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది. నేరుగా స్టేజ్ ఎక్కింది. రచ్చ రచ్చ చేసింది. నన్నే మోసం చేస్తావా, అబ్బాయితో పెళ్లికి సిద్ధమవుతావా, నీ కోసం నేను త్యాగం చేస్తే నువ్వు ఇలా చేస్తావా అంటూ వధువుతో గొడవ పడింది. నాతో వచ్చేయ్ మనమిద్దరం కలిసుందాం అంటూ వధువుని బలవతంగా లాకెళ్లే ప్రయత్నం చేసింది.

నిశ్చితార్ధ వేడుకలో రచ్చ రచ్చ చేసిన అమ్మాయిని బినాగా గుర్తించారు. వధువు, తాను నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నామని చెప్పింది. జీవితాంతం కలిసుందామని వధువు తనతో చెప్పిందని, ఆమె కోరిక మేరకు తనకు వచ్చిన మూడు పెళ్లి ప్రపోజల్స్ ను కూడా వదులుకున్నానని బినా వెల్లడించింది. తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. ఆమె చెప్పినట్లే వాటిని తిరస్కరించానంది. ఇప్పుడు ఆమె మాత్రం పెళ్లికి సిద్దమైందని బినా వాపోయింది.

నిశ్చితార్ధ వేడుకలోకి దూసుకొచ్చిన అమ్మాయి.. వధువుని లాకెళ్లే ప్రయత్నం చేయడం చూసి వరుడితో సహా అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. అసలేం జరుగుతుందో వారికి కాసేపు అర్థం కాలేదు. వధువు బంధువులు వెంటనే వచ్చి బినాను చుట్టుముట్టారు. ఆమెపై దాడి చేశారు. అక్కడి నుంచి తరిమేశారు.

అయితే, అసలు విషయం తెలిశాక వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజం తెలుసుకున్న వరుడు బిత్తరపోయాడు. మరో అమ్మాయితో వధువుకి సంబంధం ఉందని తెలిసి అతడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. వెంటనే వరుడు, అతడి తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, బినా చెప్పిన దాంట్లో నిజం లేదని వధువు వాదిస్తోంది. బినా చెప్పేదంతా అబద్ధం అంటోంది. దాంతో గొడవ పెద్దదైంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.