Viral video: వీడి పిచ్చి త‌గ‌ల‌య్య‌.. మెట్రోలో ట‌వ‌ల్‌తో పోజులేంట్రా..! లేడీస్ ఏం చేశారంటే..?

ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు విచిత్రంగా ప్రవర్తించారు. టవల్, బన్నీపై మెట్రో రైలు ఎక్కి హల్ చల్ చేశాడు. రద్దీగా ఉన్న మెట్రో రైలులోకి టవల్, బన్నీ మాత్రమే ధరించి ఎక్కడమేకాకుండా, మెట్రోలో అటూఇటూ తిరుగూ.. తన విచిత్రమైన చూపులతో మెట్రో ప్రయాణిస్తున్న వారికి నవ్వులు తెప్పించాడు.

Viral video: వీడి పిచ్చి త‌గ‌ల‌య్య‌.. మెట్రోలో ట‌వ‌ల్‌తో పోజులేంట్రా..! లేడీస్ ఏం చేశారంటే..?

Viral Video

Updated On : December 10, 2022 / 9:54 AM IST

Viral video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు యువతీ, యువకులు అనేక పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో అసభ్యకర రీతిలోనూ ప్రవర్తిస్తున్నారు. గతంలో హైదరాబాద్ మెట్రో రైల్‌లో ఓ యువతి డ్యాన్స్‌తో హల్‌చల్ చేసింది. దీంతో నిబంధనలకు విరుద్దంగా మెట్రో రైలులో డ్యాన్స్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు మెట్రో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేతరహాలో ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: వీడెవడండీ బాబు… మొసలిలాగా డ్రెస్ వేసుకుని, మొసలితోనే ఆటలు.. షాకింగ్ వీడియో

ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు విచిత్రంగా ప్రవర్తించారు. టవల్, బన్నీపై మెట్రో రైలు ఎక్కి హల్ చల్ చేశాడు. రద్దీగా ఉన్న మెట్రో రైలులోకి టవల్, బన్నీ మాత్రమే ధరించి ఎక్కడమేకాకుండా, మెట్రోలో అటూఇటూ తిరుగూ.. తన విచిత్రమైన చూపులతో మెట్రో ప్రయాణిస్తున్న వారికి నవ్వులు తెప్పించాడు. మెట్రో అద్దంలో చూస్తూ తలదువ్వుకుంటూ ఫోజులిచ్చాడు. మెట్రో ప్రయాణిస్తున్న కొందరు యువతులు ఈ యువకుడి వేషధారణ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ??मोहित गौहर ?? (@mohitgauhar)

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ‘మా ట్యాంక్‌లో నీళ్లు ఖాళీ అయ్యాయి.. ఈరోజు ఆఫీసులోనే స్నానం చేస్తా’ అని రాసిఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడానికి ధైర్యం ఉండాలి అని కొందరు రాయగా, ఎవరైనా టవల్ లాగితే వీడి పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.