Young Man Kill : తాను తయారు చేసిన హెలికాప్టరే ప్రాణం తీసింది

మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. హెలికాప్టర్ బ్లేడ్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు.

Young Man Kill : తాను తయారు చేసిన హెలికాప్టరే ప్రాణం తీసింది

Helicopter

Updated On : August 12, 2021 / 3:46 PM IST

helicopter blade hit : తాను తయారు చేసిన హెలికాప్టరే తన ప్రాణం తీసింది. కల కలగానే మిగిలిపోయింది. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. హెలికాప్టర్ బ్లేడ్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. హెలికాప్టర్ ను ట్రయల్ వేసే సమయంలో దాని బ్లేడ్ తగిలి ఇస్మాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 28 ఏళ్ల ఇస్మాయిల్ చదివింది ఏడో తరగతే. కానీ అతని బుర్ర మాత్రం పాదరసంలా పని చేసేది. ఏదీ చూసినా వెంటనే దాన్ని తయారు చేసేందుకు ట్రై చేసే వాడు.

స్నేహితులతో కలిసి మెటల్ షీట్ వర్కర్ గా పని చేస్తున్న ఇస్మాయిల్ ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉండేవాడు. సొంతూరిలో చిన్ని వర్క్ షాప్ నిర్వహిస్తున్న ఇస్మాయిల్ రెండేళ్ల క్రితం హెలికాప్టర్ తయారీకి శ్రీకారం చుట్టారు. మున్నా హెలికాప్టర్ పేరుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేశాడు. రెండేళ్ల పాటు రాత్రిబవళ్లు కష్టపడిన ఇస్మాయిల్ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున మున్నా హెలికాప్టర్ ను లాంచ్ చేయాలనుకున్నాడు.

ప్రాజెక్టు సక్సెస్ అయింది. తక్కువ ఖర్చుతో ప్రభుత్వ అవసరాల కోసం, రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉండేలా హెలికాప్టర్ ను రూపొందించారు. ప్రాజెక్టు పూర్తి కావడంతో అనుకున్నది సాధించాననే తృప్తి అతనిలో కనిపించింది. మున్నాను లాంచ్ చేయటానికి ముందు ట్రయల్స్ వేయాలని భావించాడు. అనుకున్నదే తడువుగా స్నేహితులతో కలిసి ట్రయల్స్ కు ప్లాన్ చేశాడు.

నిన్న రాత్రి సొంతూరు ఫుల్సవాంగిలో హెలికాప్టర్ ను స్టార్ట్ చేశాడు. కానీ వేగంగా తిరిగిన రోటర్ వెయిట్ కాప్టర్ బాడీని తగిలింది. అంతే పైలెట్ ప్లేస్ లో కూర్చున్న ఇస్మాయిల్.. మున్నా హెలికాప్టర్ లోనే మృతి చెందాడు. అక్కడే ఉన్న స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.