Health ID : ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడీ, డిజిటల్ రూపంలో ఆరోగ్య సమాచారం

భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయించనుంది కేంద్రం. ఆరోగ్య సమాచారం అంతా..డిజిటల్ రూపంలో భద్రం చేయనున్నారు. ఆధార్ తరహాలో...హెల్త్ ఐడీ సంఖ్యను కేటాయించే విధంగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

Health ID : ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడీ, డిజిటల్ రూపంలో ఆరోగ్య సమాచారం

Modi

Updated On : September 23, 2021 / 7:57 PM IST

Aadhar-Like Health ID : ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయించనుంది కేంద్రం. అతని ఆరోగ్య సమాచారం అంతా..డిజిటల్ రూపంలో భద్రం చేయనున్నారు. ఆధార్ తరహాలో…హెల్త్ ఐడీ సంఖ్యను కేటాయించే విధంగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. హెల్త్ ఐడీలో ఆరోగ్య రికార్డులు నమోదు కానున్నాయ. వైద్యుడి దగ్గరకు వెళ్లినా..ఫార్మసికి వెళ్లినా…ప్రతిసారి జాతీయస్థాయిలో హెల్త్ ఐడీలో సమాచారం మొత్త నిక్షిప్తం కానుంది. దీని ఆధారంగా..అతని ఆరోగ్య సమాచారాన్ని వైద్యులు పరిశీలించే వీలుంది. సెప్టెంబర్ 27వ తేదీన డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నెంబర్ తో వైద్య కార్డులు అందించనుంది. డిజిటల్ హెల్త్ మిషన్ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవియా వెల్లడించారు.

Read More : Defence Ministry : భారత అమ్ములపొదిలోకి 118 అర్జున MK-1A ట్యాంకులు

భారతదేశంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. డిజిటల్ హెల్త్ మిషన్ తో టెక్నాలజీ ఆధారంగా..దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదివరకు వైద్యులు సూచించిన మందులు, గతంలో ఏం చికిత్స తీసుకున్నారన్న సమాచారం. సదరు వ్యక్తికి అందే ఆరోగ్య పథకాలు, బీమా వివరాలు అన్నీ కల్పించనున్నారు. డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకత మెరుగుపడనుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవియా తెలిపారు. మారుమూల ప్రాంతాలకు టెలీ మెడిసిన్, ఈ ఫార్మసీల సేవలు, ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ABPM-JAY) పరిధిలోకి డిజిటల్ హెల్త్ మిషన్ రానుంది.

Read More : Software : ఫ్రెషర్స్ కి శుభవార్త.. ఐటీలో లక్ష ఉద్యోగాలు

ఇందులో ఎలాంటి సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. సమాచారం దుర్వినియోగం కాకుండా…చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. 2020, ఆగస్టు 15వ తేదీన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ పేరిట…ప్రారంభించిన ఈ కార్యక్రమాన్నే పీఎం-డీహెచ్ఎం (PM-DHM) గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తేనుంది కేంద్రం.