ఆధార్ అప్ డేట్ : ఇకపై ఆ మూడింటికీ తప్పనిసరి

ఏ అవసరానికైనా అడ్రస్ వెరిఫికేషన్ కావాలంటే ఆధార్ తప్పనిసరి అయిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన ఆధార్ కార్డును ఇన్‍కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇష్యూ చేసే పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్), బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇష్యూ చేసే యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) ఈ సర్వీసులకు ఆధార్ తప్పక వాడాల్సిందేనా అనే అంటూ పబ్లిక్ నుంచి ప్రశ్నలు మొదలైయ్యాయి.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్
ఈ మేర గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఓ సంచలన ప్రకటన చేసింది. బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ లకు ఆధార్ తప్పనిసరేం కాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు యూజీసీ, నీట్, సీబీఎస్ఈ పరీక్షలకు, స్కూల్ అడ్మిషన్‌లకు సైతం మరికొంత కాలంలో ఆధార్ అవసరం లేకపోవచ్చంటూ తెలిపింది. అపెక్స్ కోర్టులో వచ్చిన ప్రతిపాదనలు అనుసరించి ఆధార్‌ను ప్రైవేట్ యాజమాన్యాలకు ఇవ్వనవసర్లేదని చెప్పింది.
సవరించిన నియమాలను బట్టి ఆధార్‌ను తప్పక వాడాల్సిన సర్వీసులివే:
ఆధార్-పాన్ కార్డు లింకింగ్:
ఆధార్ కార్డును పాన్‌తో లింక్ చేయడం ఇప్పటికీ తప్పనిసరిగానే ఉంది. సెక్షన్ 139ఏఏ ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ పాన్ కార్డుతో ఆధార్ జత చేయడం ద్వారా డూప్లికేట్ పాన్ కార్డులను సృష్టించడాన్ని అరికట్టవచ్చు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్:
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరిగా మారనుంది. వినియోగదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ పొందేందుకు మాత్రం ఆధార్ ఉండాల్సిందే.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్:
ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయడంతో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా ఆధార్ వాడాల్సిందే.
మరికొన్ని సంస్థలకు వెరిఫికేషన్ సమయంలో ఆధార్ తప్పనిసరి అనే విషయాన్ని ఈపీఎఫ్ ఇంకా నిర్థారించలేదు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో 2018 సెప్టెంబర్ 26న ఏర్పాటైన బెంచ్ ఆధార్ వాడకం గురించి మరిన్ని నిర్ణయాలను తీసుకోనుంది.