యూపీ,బీహార్ సార్వత్రిక బరిలో ఆప్..అభ్యర్థుల జాబితా రిలీజ్

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2019 / 11:45 AM IST
యూపీ,బీహార్ సార్వత్రిక బరిలో ఆప్..అభ్యర్థుల జాబితా రిలీజ్

Updated On : March 24, 2019 / 11:45 AM IST

ఏప్రిల్-మే నెలల్లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీ,బీహార్ రాష్ట్రాల్లో చెరో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.ఆప్ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆదివారం(మార్చి-24,2019) ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.ఉత్తరప్రదేశ్‌ లోని సహరన్‌ పూర్‌ నుంచి యోగేశ్‌ దహ్యా, నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ నుంచి శ్వేతా శర్మ,అలీగఢ్‌ స్థానం నుంచి సతీశ్‌ చంద్ర, బిహార్‌ లోని కిషన్‌ గంజ్‌ స్థానం నుంచి అలీముద్దీన్‌ అన్సారీ, సీతామర్హి నియోజకవర్గం నుంచి రఘునాథ్‌ కుమార్‌, భగల్పూర్‌ సెగ్మెంట్‌ నుంచి ఈ సంతేందర్ కుమార్‌ను బరిలో నిలిపేందుకు ఆప్‌ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ(పీఎసీ) ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు.