ఆప్ అభ్యర్ధులను ప్రకటించిన కేజ్రీవాల్

  • Published By: chvmurthy ,Published On : January 14, 2020 / 04:02 PM IST
ఆప్ అభ్యర్ధులను ప్రకటించిన కేజ్రీవాల్

Updated On : January 14, 2020 / 4:02 PM IST

ఢిల్లీ శాసన సభ ఎన్నికలల్లో పోటీ చేసే ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌ బరిలో దిగుతున్నారు. పట్పర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పోటీలో ఉన్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను  ప్రకటించి ప్రతిపక్షాలకు ఊహించని షాకిచ్చారు.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 61 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చాం. 46 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పాత స్థానాల్లో పోటీ చేస్తారు. 15 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేశాం. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళలకు సీట్లు ఇవ్వగా.. ఈసారి 8 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం. 9 అసెంబ్లీ స్థానాల్లో కొత్తవాళ్లకు టికెట్లు కేటాయించామని’ ఆప్‌సీనియర్‌ నేత మనీశ్‌ తెలిపారు.