Opposition meet: ఇలా చేయకపోతే మేము విపక్షాల సమావేశానికి హాజరుకాము: కేజ్రీవాల్ పార్టీ అల్టిమేటం

ఆప్ ఇచ్చిన అల్టిమేటంపై కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ స్పందించారు.

Opposition meet: ఇలా చేయకపోతే మేము విపక్షాల సమావేశానికి హాజరుకాము: కేజ్రీవాల్ పార్టీ అల్టిమేటం

Arvind Kejriwal

Updated On : June 22, 2023 / 4:29 PM IST

Opposition meet – Aam Aadmi Party: దేశంలో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections 2024) జరగాల్సి ఉన్న వేళ శుక్రవారం బిహార్ (Bihar) రాజధాని పట్నాలో విపక్షాలు నిర్వహిస్తున్న సమావేశంలో తాము పాల్గొనాలంటే ఓ షరతుకు ఒప్పుకోవాల్సిందేనంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పాలనాధికారాలపై తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని, పార్లమెంటులో ఆర్డినెన్స్ (Centre Ordinance) ను వ్యతిరేకించాలని ఆప్ చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీ (Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల దీనిపైనే తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు పలువురు నేతలను కలిసిన విషయం తెలిసిందే.

దేశంలోని పలు పార్టీలు ఇప్పటికే దీనిపై మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ మద్దతు తెలపలేదు. దీంతో దానికి మద్దతు తెలపకపోతే భవిష్యత్తులో నిర్వహించే విపక్షాల సమావేశాలకు కూడా తాము హాజరుకాబోమని తాము స్పష్టం చేసినట్లు ఆప్ వర్గాలు చెప్పాయి.

కాంగ్రెస్ ఏమంది?

ఆప్ ఇచ్చిన అల్టిమేటంపై కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ స్పందించారు. విపక్షాల సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకాకపోతే ఆయనను మిస్ అయ్యేవారు ఎవరూ ఉండరని చురకలు అంటించారు. సమావేశానికి హాజరుకాకుండా ఉండడానికి కేజ్రీవాల్ సాకులు వెతుకుతున్నారని తమకు తెలుసని చెప్పారు.

Opposition Meet: విపక్షాల మీటింగుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు