Rail Coaches: ఐడియా అదిరిపోయిందంతే.. పాడైపోయిన రైల్వే కోచ్‌లను ఏం చేస్తున్నారో తెలుసా?
ఇప్పటికే రెండు కంపెనీలకు టెండర్లు ఇచ్చామని అధికారులు వివరించారు.

Abandoned Rail Coaches
Restaurants At Jammu: రైల్వే కోచ్‌లను చాలా కాలం పాటు వాడిన తర్వాత పాడైపోతాయి. వాటిని అలాగే ఖాళీగా ఉండే రైల్వే పట్టాలపై చూస్తుంటాం. వాటిని రెస్టారెంట్లుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు వేసుకున్నారు. కత్రా, జమ్మూ రైల్వే స్టేషన్లలో ఈ థీమ్-బేస్డ్ రెస్టారెంట్లను త్వరలోనే చూడవచ్చు.
‘బ్యూటీఫుల్ రెస్టారెంట్స్ ఆన్ వీల్స్’ అని దీనికి పేరు పెట్టారు. పాత ట్రైన్ కోచ్‌లకు మెరుగులు దిద్ది ఆకర్షణీయంగా తయారు చేస్తారు. వాటిని రెస్టారెంట్లుగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయని అధికారులు ఇవాళ మీడియాకు తెలిపారు. ఇప్పటికే రెండు కంపెనీలకు టెండర్లు ఇచ్చామని వివరించారు.
సంవత్సరానికి దాదాపు రూ.50 లక్షల ఆదాయాన్ని రాబడతాయని అంచనా వేశారు. డిసెంబరు మొట్టమొదటి కోచ్ రెస్టారెంటును ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. ఈ రెండు ఏసీ రెస్టారెంట్లకు వరుసగా అన్నపూర్ణ, మా దుర్గాగా పేర్లు పెట్టనున్నట్లు తెలిపారు. కోచ్ ను రెస్టారెంటుగా మార్చేందుకు 90 రోజుల సమయం పడుతుందని చెప్పారు. అన్ని సౌకర్యాలతో రెస్టారెంట్లను రూపొందిస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగానూ ఇటువంటి రెస్టారెంట్లు రానున్నాయి.
Chennai: రూ.2 వేలు పంపితే.. ఇతడి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు వచ్చి పడ్డాయ్