Abhishek Banerjee : దేశవ్యాప్తంగా టీఎంసీ..బీజేపీ ఉన్న చోట్ల పోటీ!
దేశంలోని అన్ని ప్రాంతాలకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని విస్తరిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.

Abhishek Banerjee
Abhishek Banerjee దేశంలోని అన్ని ప్రాంతాలకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని విస్తరిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. సోమవారం విలేఖరుల సమావేశంలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ..రాబోయే నెలరోజుల్లో విస్తరణ ప్రణాళికలతో పార్టీ ముందుకొస్తుందని చెప్పారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి రాష్ట్రంలో టీఎంసీ పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా తన ఎంపికపై బీజేపీ చేసిన బంధుప్రీతి ఆరోపణలను అభిషేక్ బెనర్జీ తోసిపుచ్చారు. ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లో ఉండాలని పార్లమెంట్ లో చట్టం తీసుకువస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. రాబోయే 20 ఏళ్లలో మంత్రి పదవి సహా ప్రభుత్వంలో ఎలాంటి పదవి చేపట్టాలన్న ఉద్దేశం తనకు లేదని దీదీ మేనల్లుడు పేర్కొన్నారు. పార్టీ ఎదుగుదలకు పనిచేస్తానని తేల్చిచెప్పారు.