Bollywood Actor : ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా…

బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కొనసాగుతున్న దాడుల మధ్య బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారని ఆమె బృందం సభ్యుడు తెలిపారు.....

Bollywood Actor : ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా…

Bollywood Actor Nushrratt Bharuccha

Updated On : October 8, 2023 / 11:15 AM IST

Bollywood Actor : బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కొనసాగుతున్న దాడుల మధ్య బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారని ఆమె బృందం సభ్యుడు తెలిపారు. బాలీవుడ్ నటి హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ వెళ్లినట్లు ఆమె బృందం సభ్యుడు వెల్లడించారు.

Indian Students : ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

‘‘ఈ రోజు ముందు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నటి నుష్రత్ నేలమాళిగలో సురక్షితంగా ఉన్నప్పుడు నేను చివరిసారిగా ఆమెను సంప్రదించగలిగాను. భద్రతా చర్యల దృష్ట్యా మరిన్ని వివరాలను వెల్లడించలేం. అయితే అప్పటి నుంచి మేం కనెక్ట్ కాలేకపోయాం. మేం నుష్రత్‌ను సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

Israel Palestina Crisis: ఏంటీ ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం? చిన్న స్థలం కోసం ఎందుకు మూడు మతాలు అంతలా కొట్టుకుంటున్నాయి?

శనివారం గాజా స్ట్రిప్‌లోని మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో 200 మందికి పైగా మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. హమాస్ దాడి తర్వాత ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్‌కు బయలుదేరే విమానాలను రద్దు చేసింది.