Gautami : బీజేపీని వీడిన తర్వాత ఆ పార్టీలో చేరిన నటి గౌతమి..

నటి గౌతమి 25 ఏళ్లుగా బీజేపీ పార్టీలో ఉన్నారు.

Gautami : బీజేపీని వీడిన తర్వాత ఆ పార్టీలో చేరిన నటి గౌతమి..

Actress Gauthami Joined in AIDMK Party at Tamilnadu after quitting BJP

Updated On : February 15, 2024 / 8:29 AM IST

Gautami : సీనియర్ నటి గౌతమి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంది. కమల్ హాసన్ తో కొన్నేళ్లు రిలేషన్ లో ఉండి బాగా వైరల్ అయింది. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా దాదాపు 25 ఏళ్లుగా ఉన్నారు గౌతమి.

నటి గౌతమి 25 ఏళ్లుగా బీజేపీ(BJP) పార్టీలో ఉన్నారు. LK అద్వానీ రథయాత్ర సమయంలో కూడా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు. అయితే గత సంవత్సరం తాను కష్టాల్లో ఉన్నా, కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నా పార్టీ ప్రముఖులు హెల్ప్ చేయలేదు అని ఆరోపణలు చేస్తూ బీజేపీ పార్టీని వీడారు. అప్పట్నుంచి కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా ఉన్న గౌతమి తాజాగా నిన్న ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం – ఏఐడీఎంకే(AIDMK) పార్టీలో చేరారు.

Also Read : Teja Sajja : ‘హనుమాన్’ సినిమాతో స్టార్ హీరోల సరసన తేజ సజ్జా.. కేవలం 8 మంది మాత్రమే సాధించిన రికార్డ్..

ప్రస్తుతం తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో నటి గౌతమి చేరింది. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ సీఎం పళనిస్వామిని కలిసి ఆయన ఆధ్వర్యంలో గౌతమి ఆ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో గౌతమి చర్చగా మారారు.