అంబానీ, ఆదానీ చట్టాలను రద్దు చెయ్యాలి

గత 11 రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన 12 వ రోజు.. సోమవారం విస్తృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో, డిసెంబర్ 8న మంగళవారం, రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి 18 ప్రతిపక్ష పార్టీల మద్దతు ఇప్పటికే లభించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకు చెందిన 10 పార్టీలు ఈ మేరకు భారత్ బంద్‌కు మద్దతు తెలుపుతూ ప్రకటన చేశాయి.
దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ పార్టీల నాయకులు అండగా నిలుస్తుండగా.. కొత్త వ్యవసాయ చట్టాల్ని అంబానీ-అదానీ చట్టాలుగా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు మించి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనని ముందుకు తెచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లకు మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అన్నదాతలు ఆందోళన చేపట్టిన తొలిరోజు నుంచి తమ ఆమ్ ఆద్మీ పార్టీ వారికి అండగా నిలబడిందని ఆయన అన్నారు.
రైతు ఉద్యమంపై రాజకీయాలు వేడెక్కుతుండగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌కు రైతులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా వారికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం వ్యవసాయ చట్టాలను ‘అదానీ-అంబానీ వ్యవసాయ చట్టాలు’ అని పిలిచారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ద్రవిడ మున్నేట్రా కజకం(డిఎంకె) చీఫ్ ఎంకె స్టాలిన్, గుప్కర్ మానిఫెస్టో అలయన్స్ (పిఎజిడి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో సహా రైతు సంఘాల ‘భారత్ బంద్’కు మద్దతుగా 18పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రసనకారుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి.