నవంబర్-11లోగా….ఆ మూడు ఎయిర్ పోర్ట్ లు అదానీ గ్రూప్ చేతికి

Adani Group to officially take over 3 airports ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి అక్టోబర్-31న మంగళూరు ఎయిర్ పోర్ట్, నవంబర్-2న లక్నో ఎయిర్ పోర్ట్, నవంబర్-11న అహ్మదాబ్ ఎయిర్ పోర్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని గురువారం(అక్టోబర్-22,2020)అదానీ గ్రూప్ తెలిపింది. ఆ మూడు ఎయిర్ పోర్ట్ లలో… ఆపరేషన్స్,మేనేజ్ మెంట్, అభివృద్ధి ఇక తమ బాధ్యతేనని అదానీ తెలిపింది.
వియానయాన మంత్రిత్వశాఖ…ఈ మూడు ఎయిర్ పోర్ట్ లలో కస్టమ్స్,ఇమ్మిగ్రేషన్,సెక్యూరిటీ వంటి సర్వీసులు అందించేందుకు అదానీ గ్రూప్ కు చెందిన మూడు కంపెనీలతో ఎంవోయూ(memorandums of understanding)పై సంతకం చేసినట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఓ ప్రెస్ రిలీజ్ నోట్ లో తెలిపింది. ఈ మూడు ఎయిర్ పోర్ట్ లలో CNS-ATM సర్వీసుల ఏర్పాటుకై…AAI కూడా అదానీ గ్రూప్ తో మూడు ప్రత్యేక CNS-ATM ఒప్పందాలపై సంతకం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన నోట్ లో ఏఏఐ పేర్కొంది. CNS-ATM అంటే కమ్యూనికేషన్స్,నేవిగేషన్,సర్వైవిలెన్స్ సిస్టమ్స్ ఫర్ ఎయిర్ ట్రాఫిక్ మెనేజ్ మెంట్.
కాగా,దేశంలోని ఆరు ప్రధాన విమానశ్రయాల(లక్నో,అహ్మదాబాద్,జైపూర్,మంగళూరు,తిరువనంతపురం,గౌహతి) ప్రైవేటీకరణకు గతేడాది ఫిబ్రవరిలో కేంద్రం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బిడ్డింగ్ లను ఆహ్వానించగా…ఆదానీ ఎంటర్ ప్రైజస్ విజేతగా నిలిచింది. ఆరు ఎయిర్ పోర్ట్ ల నిర్వహణను అదానీ గ్రూప్ దక్కించుకుంది.
మొదట, గతేడాది జులైలో మూడు ఎయిపోర్ట్ లు(మంగళూరు,లక్నో,అహ్మదాబాద్)అదానీ ఎంటర్ ప్రైజస్ కు లీజ్ కు ఇచ్చే ప్రపోజల్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మిగిలిన మూడు(జైపూర్,తిరువనంతపురం,గౌహతి)ఎయిర్ పోర్ట్ లను కూడా అదానీ ఎంటర్ ప్రైజస్ కు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ఈ ఏడాది ఆగస్టు-19న కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.