మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం.. ఆ దేశ పార్లమెంటులో భారత ప్రధాని కీలక కామెంట్స్‌

"త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా సుమారు 16 శాతం ఉంది" అని మోదీ అన్నారు.

మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం.. ఆ దేశ పార్లమెంటులో భారత ప్రధాని కీలక కామెంట్స్‌

Updated On : July 3, 2025 / 4:36 PM IST

ప్రధాని మోదీ ఎనిమిది రోజుల ఘనా, ట్రినిడాడ్‌-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న, ఇవాళ పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటిస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

మోదీ ఘనా అత్యున్నత పురస్కారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డు అందుకున్నారు. ఇవాళ ఘనా పార్లమెంటులో మోదీ ప్రసంగించారు.

“ఈ సభను ఉద్దేశించి ప్రసంగించటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ప్రజాస్వామ్య ఆత్మను వెలుగించే ఘనా నేలపై ఉండటం నాకు దక్కుతున్న గొప్ప గౌరవం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం (భారత్) తరఫున, 1.4 బిలియన్ భారతీయుల తరఫున ఘనాకు ప్రేమతో వచ్చాను” అన్నారు.

“భారత్ త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. వాతావరణ మార్పులకు తగ్గట్లు స్పందించేందుకు, నిలకడైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు మిషన్ లైఫ్ ప్రారంభించాము. ‘వన్ వరల్డ్, వన్ సన్, వన్ గ్రిడ్’, ‘వన్ వరల్డ్, వన్ హెల్త్’ వంటి గ్లోబల్ కార్యక్రమాలకు ఇది బలమిస్తోంది. అంతర్జాతీయ సౌర అలయెన్స్ ద్వారా సౌర శక్తి, స్థిరత్వం కోసం పనిచేస్తున్నాము.

“రోబో” మూవీలో ఒకే సమయంలో అనేక ప్రాంతాల్లో రోబో భారీ చోరీలు.. ఈ టెక్కీ ఒకే సమయంలో అనేక కంపెనీల్లో ఉద్యోగాలు..

అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయెన్స్ ద్వారా అడవి జీవాలను రక్షిస్తున్నాము. గ్లోబల్ బయోఫ్యూయెల్ అలయెన్స్ ద్వారా స్వచ్ఛమైన బయోఫ్యూయెల్స్ అభివృద్ధి చేసి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తున్నాము” అన్నారు.

“ఈ సెప్టెంబర్‌లో ఘనా, ఆఫ్రికా ప్రాంతీయ అంతర్జాతీయ సౌర అలయెన్స్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుండటం సంతోషంగా ఉంది. ప్రపంచం ఒక కుటుంబం అనే మన సంస్కృతిని ఇది స్పష్టంగా చూపుతోంది. గత దశాబ్దంలో భారత్‌లో పెద్ద మార్పు జరిగింది. భారత ప్రజలు శాంతి, భద్రత, అభివృద్ధిపై విశ్వాసం చూపించారు” అన్నారు.

“భారత ప్రజలు వరుసగా మూడు సార్లు ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆరు దశాబ్దాల తర్వాత ఇది సాధ్యమైంది. ఇప్పుడు భారత్‌లో స్థిరమైన పాలన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉంది. త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా సుమారు 16 శాతం ఉంది” అని మోదీ అన్నారు.