నిర్భయ దోషులను క్షమించి వదిలేయమ్మా: తల్లికి మహిళా న్యాయవాది ఇందిరాజైసింగ్ సలహా

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 04:42 AM IST
నిర్భయ దోషులను క్షమించి వదిలేయమ్మా: తల్లికి మహిళా న్యాయవాది ఇందిరాజైసింగ్  సలహా

Updated On : January 18, 2020 / 4:42 AM IST

నిర్భయపై ఘోరమైన అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన దోషులను క్షమించి వదిలేయమని నిర్భయ తల్లికి సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్ ద్వారా  సంచలన సూచన చేశారు. 

రు.2012వ సంవత్సరంలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా కొట్టి హతమార్చిన నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించకుండా తల్లిగా క్షమించాలని మహిళా న్యాయవాది ఇందిరాజైసింగ్ నిర్భయ తల్లిని కోరారు. నిర్భయ దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించడంతో ఫిబ్రవరి 1వతేదీన వారిని ఉరి తీయాలని నిర్ణయించిన క్రమంలో ప్రముఖ మహిళా న్యాయవాది నిర్భయ తల్లికి ఈ సూచన చేశారు.   

నిర్భయ హత్యాచారం అనంతరం ఆమె తల్లి పడే మానసిక వేదన ఎటువంటిదో నేను అర్థంచేసుకోగలను..కాని,1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళినిని సోనియాగాంధీ క్షమించి, ఉరి శిక్ష విధించవద్దని కోరారనీ..అటువంటి సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకొని నిర్భయ దోషులను ఉరి తీయకుండా నిర్భయ తల్లి క్షమించి వదిలివేయాలని మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ సూచించారు.

దీనిపై స్పందించిన నిర్భయ తల్లి ఆశాదేవి నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించేవరకూ తనకు సంతృప్తి ఉండదని నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. జనవరి 22న ఈ నలుగురు దోషులకు ఉరి ఖరారు కాగా..రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవటం..దాన్ని తిరస్కరించటంతో ఈ నలుగురికి ఫిబ్రవరి 1న  ఉరిశిక్ష అమలు కానుంది. తన కుమార్తె పేగుల్ని కూడా బైటకు లాగి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడినవారికి ఉరిశిక్ష పడేవరకూ తనకు మనశ్శాంతి లేదని వారి ఉరి కోసం తాను వేయి కళ్లతో ఎదురు చూస్తున్నానని నిర్బయ తల్లి ఆశాదేవి స్పష్టంచేశారు. నిర్భయ నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని దేశ‌మంతా కోరుకుంటున్న‌ద‌ని, జైసింగ్ లాంటి వాళ్ల‌వ‌ల్లే అత్యాచార బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఆశాదేవి అన్నారు.