మై ఫ్రెండ్…కరోనా నుంచి మీరు త్వరగా కోలుకోవాలి

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2020 / 04:50 PM IST
మై ఫ్రెండ్…కరోనా నుంచి మీరు త్వరగా కోలుకోవాలి

Updated On : October 2, 2020 / 5:32 PM IST

Modi On Trump Corona Positive Recovery ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరూ క్వారంటైన్ కు వెళ్లారు. మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ కు కరోనా సోకడం ఇప్పుడు యూఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.


అయితే, ట్రంప్ కి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే పలు దేశాధినేతలు… ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. భారత ప్రధాని మోడీ కూడా ట్విట్టర్ లో స్పందించారు. ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. ట్రంప్ చేసిన ట్వీట్ ను మోడీ షేర్ చేస్తూ… నా మిత్రులు డొనాల్డ్ ట్రంప్, మెలానియాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటూ ట్వీట్ చేశారు.


నిత్యం ట్రంప్ వెన్నంటే ఉండే ఆయన సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా వచ్చినవెంటనే అప్రమత్తమైన శ్వేతసౌధ సిబ్బంది.. ట్రంప్, ఆయన భార్యకు కూడా టెస్టులు నిర్వహించారు. పరీక్షల్లో వారిరువరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. తమకు కరోనా వచ్చిందని స్వయంగా ట్రంప్ ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.