African Swine Flu : కేరళలో ఆఫ్రికన్ స్వైన్ఫ్లూ…190 పందులను వధించిన ప్రభుత్వం
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వయనాడ్ జిల్లా మనంతవాడి ఫ్రాంతంలోని రెండు పొలాల వద్ద ఉన్న పందుల పెంపకం కేంద్రంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది.

Kerala African Swine Flu
African Swine Flu : కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వయనాడ్ జిల్లా మనంతవాడి ఫ్రాంతంలోని రెండు పొలాల వద్ద ఉన్న పందుల పెంపకం కేంద్రంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక ఫారంలోని పందులను వధించారు.
భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూర్టీ యానిమల్ డిసీజెస్ సంస్థలో పందుల నమూనాలను పరీక్షించారు. అయితే పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. సుమారు 300 పందుల్ని వధించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇవాళ 190 పందులను చంపేసి.. పూడ్చి పెట్టారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులో ఉందని వయనాడ్ జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మనంతవాడి సబ్ కలెక్టర్ శ్రీలక్ష్మి చెప్పారు.