ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసి.. చివరకు సురక్షితంగా ల్యాండైన ఎయిరిండియా విమానం

అనంతరం ఎమర్జెన్సీ అని ప్రకటించారు. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేసి, అత్యవసర ల్యాండింగ్‌ చేస్తామని తెలిపారు.

ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసి.. చివరకు సురక్షితంగా ల్యాండైన ఎయిరిండియా విమానం

air india flight emergency landing

Updated On : October 11, 2024 / 9:40 PM IST

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా అందులోని ప్రయాణికులు, వారి బంధువులు ఇవాళ తీవ్ర ఆందోళనకు గురి కావాల్సి వచ్చింది. తమిళనాడులోని తిరుచ్చి నుంచి 144 మందితో బయల్దేరిన కొద్ది సమయానికే హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయడం లేదని పైలట్లు గుర్తించారు.

అనంతరం ఎమర్జెన్సీ అని ప్రకటించారు. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేసి, అత్యవసర ల్యాండింగ్‌ చేస్తామని తెలిపారు. చివరకు ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎయిరిండియా విమానం ఏఎక్స్‌బీ 613 తిరుచ్చి నుంచి షార్జాకు బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒకవేళ విమానం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సురక్షితంగా ల్యాండ్‌ కావాలంటే అందులోని ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాలి. దీంతో దాదాపు రెండు గంటల పాటు విమానాన్ని పైలట్లు గాల్లోనే తిప్పారు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులను ఆసుపత్రులకు తరలించేందుకు 20 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. అలాగే, 20 అగ్నిమాపక యంత్రాలు, పారామెడికల్‌ సిబ్బందిని విమానాశ్రయంలో ఉంచారు. చివరకు విమానం సురక్షితంగా దిగింది.

తెలంగాణలో కులగణనకు సర్కార్ నిర్ణయం.. 2 నెలల్లో పూర్తి చేసేలా ఆదేశాలు..