Masala Jalebi: ‘మసాలా జిలేబీ’ ఫొటో వైరల్.. ఇదేం వంటకం? అంటూ నెటిజన్ల ఆగ్రహం
జిలేబీ ఎక్కడ కనపడినా మన నోరు ఊరుతుంది. తియ్యగా ఉండే జిలేబీని విందుల్లో వాడుతుంటారు. రోడ్డుపై ఎక్కడ జిలేజీలు అమ్మే బండి ఉన్నా అక్కడ జిలేబీలను చాలా మంది లొట్టలేటుసుకుంటూ తింటారు. జిలేబీలోని తియ్యదనం అంటే అంత ఇష్టం మరి. అయితే, ఎవరైనా జిలేబీలను కర్రీలో వేసుకుని తింటారా? ‘మసాలా జిలేబీ’లను ఎక్కడైనా అమ్ముతారా? అదే జరిగింది.

Masala Jalebi
Masala Jalebi: జిలేబీ ఎక్కడ కనపడినా మన నోరు ఊరుతుంది. తియ్యగా ఉండే జిలేబీని విందుల్లో వాడుతుంటారు. రోడ్డుపై ఎక్కడ జిలేజీలు అమ్మే బండి ఉన్నా అక్కడ జిలేబీలను చాలా మంది లొట్టలేటుసుకుంటూ తింటారు. జిలేబీలోని తియ్యదనం అంటే అంత ఇష్టం మరి. అయితే, ఎవరైనా జిలేబీలను కర్రీలో వేసుకుని తింటారా? ‘మసాలా జిలేబీ’లను ఎక్కడైనా అమ్ముతారా? అదే జరిగింది.
ఓ వ్యక్తి పోస్ట్ చేసిన ‘మసాలా జిలేబీ’ ఫొటోను చూసి.. ఇదేం వంటకం? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి జిలేబీ చేసినందుకు ఐపీసీ సెక్షన్ కింద ఏదైనా కేసు పెట్టొచ్చా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి వంటకాలపై కేసు పెట్టే అవకాశం ఉంటే వెంటనే పెడతామని కొందరు పేర్కొన్నారు.
కొందరు మాత్రం ఈ కొత్త రకం వంటకానికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ పాతరకం వంటకాలేనా కొత్తరకం వంటకాలు కూడా ట్రై చేయాలంటున్నారు. ఈ మసాలా జిలేబీని ఇంట్లో తయారు చేసుకున్నారో, హోటల్ నుంచి తెచ్చుకున్నారో కానీ, ఈ జిలేబీ మాత్రం సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది.
Anyone want masala jalebi? pic.twitter.com/r1SzuQCD0y
— Mayur Sejpal ?? (@mayursejpal) December 26, 2022
Rahul Gandhi: రాహుల్ గాంధీ భద్రతపై కేంద్రానికి కాంగ్రెస్ లేఖ..