Rahul Gandhi: రాహుల్ గాంధీ భద్రతపై కేంద్రానికి కాంగ్రెస్ లేఖ..

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు చుట్టూ స్థానిక పోలీసుల రక్షణ ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో పూర్తయిన అనంతరం పంజాబ్, జమ్మూ, కశ్మీర్ లోకి ప్రవేశిస్తుందని...

Rahul Gandhi: రాహుల్ గాంధీ భద్రతపై కేంద్రానికి కాంగ్రెస్ లేఖ..

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తయిన యాత్ర గత మూడురోజుల క్రితం ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీలో భారత్ జోడో యాత్రకు భారీ స్పందన లభించింది. కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. అయితే, రాహుల్ గాంధీ చుట్టూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ మేరకు రాహుల్ పాదయాత్రలో భద్రతా లోపాలను ఎత్తుచూపుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ యాత్రకు హాజరు కావాలన్న కాంగ్రెస్.. నిరాకరించిన అఖిలేష్, మాయావతి

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు చుట్టూ స్థానిక పోలీసుల రక్షణ ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో పూర్తయిన అనంతరం పంజాబ్, జమ్మూ, కశ్మీర్ లోకి ప్రవేశిస్తుందని, అక్కడ సున్నిత ప్రాంతాలు కావటంతో భద్రతను బలోపేతం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టి తీసుకెళ్లామని తెలిపారు.

 

ఇద్దరు ప్రధాన మంత్రులను కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అని. రాహుల్ గాంధీ భద్రతపై మేమంతా చాలా ఆందోళన చెందుతున్నామని పవన్ ఖేరా అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో భారత్ జోడో యాత్రలో ఇటీవల జరిగిన పలు విషయాలను ప్రస్తావించారు. భద్రతాలోపం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఆ లేఖలో ప్రస్తావించారు.