ఫ్రీ రేషన్ నవంబర్ వరకు అని మోడీ అంటే…. మమతా ఏకంగా వచ్చే జూన్ వరకు ప్రకటించేశారు…

ఫ్రీ రేషన్ నవంబర్ వరకు అని మోడీ అంటే…. మమతా ఏకంగా వచ్చే జూన్ వరకు ప్రకటించేశారు…

Updated On : June 30, 2020 / 7:01 PM IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆఫర్ కు మించి సీఎం మమతా బెర్జీ.. వరాలు ప్రకటించారు. దేశ ప్రజలనుద్దేశించి ఫ్రీ రేషన్ అని చెప్పిన కాసేపటికే మమతా మరో ఆఫర్ ఇచ్చారు. ప్రధాని ఉచితంగా ఛాత్ పూజా వరకూ అంటే నవంబరు నెల వరకూ… ఇస్తామని బెంగాల్ ప్రజలకు మమతా వచ్చే ఏడాది జూన్ వరకూ ఫ్రీ రేషన్ అని హామీ ఇచ్చేశారు.

‘బెంగాల్ ప్రజలకు జూన్ 2021 వరకూ ఫ్రీ రేషన్ ఇవ్వనున్నా’మని మమతా బెనర్జీ అన్నారు. ప్రధానమంత్రి జాతికి నవంబరు వరకూ ఫ్రీ రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే మమతా ఈ ప్రకటన చేశారు. కేంద్రం ఇచ్చే దానికంటే నాణ్యమైన ధాన్యాన్ని ఇస్తామని మమతా అన్నారు. బెంగాల్ లో కేవలం 60శాతం మంది కేంద్రం నుంచి వచ్చే రేషన్ అందుకుంటున్నారు.

ఇండియాలోని పేదవారికి దాదాపు 80కోట్లమందికి గవర్నమెంట్ స్కీం వర్తిస్తుందని మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా మార్చి నుంచి విధించిన లాక్‌డౌన్ ను నవంబరు వరకూ పొడిగించనున్నారు. ‘పండుగలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చేఐదు నెలలకు స్కీం వర్తింపజేస్తున్నారు. 80 కోట్ల మందికి మనిషికి 5కిలోల చొప్పున ఒక కేజీ పప్పును దీపావళి, ఛాత్ పూజా వరకూ అంటే నవంబరు వరకూ ఇవ్వనున్నారు’ అని మోడీ అన్నారు.

Read:అన్‌లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నాం.. వర్షాకాలం వస్తోంది.. జాగ్రత్తగా ఉండాలి : ప్రధాని మోడీ