అగ్ని-2 పరీక్ష విజయవంతం
అగ్ని-2 పరీక్ష సక్సెస్ అయింది. భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది.

అగ్ని-2 పరీక్ష సక్సెస్ అయింది. భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది.
అగ్ని-2 పరీక్ష సక్సెస్ అయింది. భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలామ్ ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కాంప్లెక్స్ 4 నుంచి దీనిని పరీక్షించామని రక్షణ శాఖ తెలిపింది.
ఈ క్షిపణికి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దాదాపు 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి బరువు సుమారు 17 టన్నులు. మరో 1000 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. అగ్ని-2 క్షిపణిని మొదటిసారి 1999 ఏప్రిల్ 11వ తేదీన పరీక్షించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 20వ తేదీన పరీక్షించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలో చేరింది.
దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. అగ్ని-2 క్షిపణిని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లేబొరేటరీ, డీఆర్‌డీఓ, హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలు కలిసి సంయుక్తంగా తయారు చేశాయి. ఇది మోసుకెళ్లగలిగే బరువును తగ్గించడం వల్ల క్షిపణి లక్ష్య దూరాన్ని మరింత పెంచే వెసులుబాటు కూడా ఉంది.
అగ్ని క్షిపణి సిరీస్‌లలో భాగంగా అగ్ని-2 క్షిపణిని ప్రయోగించారు. ఇప్పటికే విజయవంతంగా ప్రయోగించిన అగ్ని-1, అగ్ని-3 క్షిపణుల్లో అగ్ని-1ను దేశ రక్షణ విభాగానికి అప్పగించారు. అగ్ని-3ని కూడా అప్పగించే దిశగా చర్యలు సాగుతున్నాయి.