Panneerselvam Wife Dies : పన్నీర్ సెల్వం సతీమణి కన్నుమూత

తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మృతి చెందార

Panneerselvam Wife Dies : పన్నీర్ సెల్వం సతీమణి కన్నుమూత

Panneerselvam’s Wife Dies In Chennai

Updated On : September 1, 2021 / 12:54 PM IST

AIADMK leader Panneerselvam’s wife dies :  తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. విజయలక్ష్మీ గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం కన్నుమూశారు.

65 ఏళ్ల విజయలక్ష్మికి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు. ఈ పరిస్థితుల్లో ఆమెను GEM ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా గత బుధవారం ఆమె ఆరోగ్యం పరిస్ధితి బాగా క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఆమెను కాపాడటానికి ఎంతగా యత్నించినా ఫలించలేదు. అలా గుండెనొప్పితో బాధపడుతు 6:45 గంటలకు విజయలక్ష్మి మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.

విజయలక్ష్మీ, పన్నీర్ సెల్వం దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆమె మృతితో అన్నాడీఎంకే పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతికి పలువురు నేతలు, ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సీనియర్ మంత్రులు, ఎఐఎడిఎంకె జాయింట్ కోఆర్డినేటర్, మాజీ ముఖ్యమంత్రి కె. పళనిస్వామి, పార్టీ సీనియర్ నాయకులు పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి మృతదేహానికి నివాళులర్పించారు.