టెన్షన్.. హైటెన్షన్ : ఎయిర్ ఇండియాకు ‘హైజాక్’ బెదిరింపు కాల్
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు హైజాక్ బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్టు శనివారం (ఫిబ్రవరి 23, 20419) ఫోన్ కాల్ వచ్చింది.

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు హైజాక్ బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్టు శనివారం (ఫిబ్రవరి 23, 20419) ఫోన్ కాల్ వచ్చింది.
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు హైజాక్ బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్టు శనివారం (ఫిబ్రవరి 23, 20419) ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఎయిర్ లైన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనతో ఇప్పటికే భారత్, పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
తాజాగా ఎయిర్ ఇండియాకు హైజాక్ బెదిరింపు కాల్ రావడంతో రెండు దేశాల సరిహద్దుల మధ్య మరోసారి టెన్షన్ నెలకొంది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఏజెన్సీలు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ కంట్రోల్ సెంటర్ కు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
‘‘టెర్రరిస్ట్ బెదిరింపు కాల్ కాదు.. చూస్తుంటే.. ఎవరో ఆకతాయి ఫేక్ కాల్ చేసినట్టుగా అనిపిస్తోంది. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాం’’ అని సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఒకరు తెలిపారు. హైజాక్ బెదిరింపు కాల్ రావడంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) భద్రతను కట్టుదిట్టం చేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్ ఆపరేటర్లను రంగంలోకి దింపి దర్యాప్తు వేగవంతం చేసింది. భద్రత చర్యలను చేపట్టింది. ఎంట్రీ టెర్మనల్ భవనం నుంచి మెయిన్ గేట్ వరకు వచ్చే పోయే ప్రయాణికులు, సిబ్బంది, విజిటర్స్ అన్నిచోట్ల తనిఖీలు చేపట్టింది. ఇండియన్ ఎయిర్ లైన్స్ దేశయంగా విమాన సర్వీసులను నడుపుతోంది. హైజాక్ బెదిరింపు కాల్ తో దేశీయ, అంతర్జాతీయ అన్నీ విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా తాత్కాలికంగా నిలిపివేసింది.