Video: విమానాశ్రయంలో స్పాంజి బోర్డును వాడుతూ ఇతడు ఏం చేశాడో చూడండి..

కన్వేయర్ బెల్ట్ లో ఉంచిన లగేజీ బయటకు వస్తున్న సమయంలో మరో కన్వేయర్ బెల్ట్ ను తాకి విరిగిపోకుండా..

Video: విమానాశ్రయంలో స్పాంజి బోర్డును వాడుతూ ఇతడు ఏం చేశాడో చూడండి..

Viral Video

Updated On : March 31, 2024 / 6:45 PM IST

విమానాశ్రయాలకు ఎంతో లగేజీ తీసుకుని వెళ్తుంటాం. సూట్ కేసులు, బ్యాగులు మోసుకెళ్తుంటాం. అవి పాడయిపోకుండా, వాటిని పొడగొట్టుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటాం. అయితే, విమానాశ్రయంలో కన్వేయర్ బెల్ట్ సరిగ్గా లేకుంటే కష్టమే.

సూట్ కేసులను కన్వేయర్ బెల్ట్ లో ఉంచిన సమయంలో అవి బయటకు వచ్చే సమయంలో సూట్ కేసులు విరిగిపోయే అవకాశమూ ఉంటుంది. దీంతో ప్రయాణికులు ఎంతో అసహనానికి గురవుతారు.

కన్వేయర్ బెల్ట్ లో ఉంచిన లగేజీ బయటకు వస్తున్న సమయంలో మరో కన్వేయర్ బెల్ట్ ను తాకి విరిగిపోకుండా ఓ విమానాశ్రయ సిబ్బంది చేసిన ప్రయోగానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

విమానాశ్రయ సిబ్బంది స్పాంజి బోర్డును పట్టుకుని కన్వేయర్ బెల్ట్ వద్ద నిలబడ్డాడు. సూట్ కేసులు కన్వేయర్ బెల్ట్ నుంచి వచ్చి పడుతున్న సమయంలో స్పాంజి బోర్డును అడ్డుగా పెట్టాడు. వారణాసి విమానాశ్రయంలో అధికారులు చేసిన ఈ ఏర్పాటు పట్ల సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది.

ప్రయాణికుడికి రూ.7.66 కోట్ల బిల్లు వేసిన ఉబర్ ఆటో.. వీడియో చూస్తారా?