UP Election : యూపీ+యోగి=ఉపయోగి కాదు అన్ ఉపయోగి..ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న అఖిలేష్,ప్రియాంక
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన "ఉత్తరప్రదేశ్"లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని మాజీ సీఎం అఖిలేష్

Yogi
UP Election : వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన “ఉత్తరప్రదేశ్”లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రెండు నెలల క్రితమే ప్రచారం షురూ చేసిన ఎస్పీ..బీజేపీ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తోంది. మరోవైపు,బీజేపీ కూడా ప్రచార పర్వంలో వేగంగా ఉంది. ఏకంగా ప్రధాని మోదీనే వరుస యూపీ పర్యటనలు చేస్తూ…అఖిలేష్ యాదవ్ పార్టీని ముఖ్యంగా చేస్తూ యూపీ ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే తారాస్థాయికి తీసుకెళ్లారు. ఇక,కాంగ్రెస్ అయితే ఈ సారి ఎన్నికల్లో గెలిచేది తామే అని చెబుతున్నప్పటికీ..ఇప్పటివరకు విడుదలైన సర్వేలు హస్తానికి యూపీ ఓటర్లు చెయ్యి ఇస్తారనే చెబుతున్నాయి. ఇక,మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రచారపర్వంలో వెనుకపడిపోయింది. యామావతి పెద్దగా ర్యాలీలు,ప్రచారసభల్లో పాల్గొనడం లేదు.
అయితే ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోన్న అఖిలేష్ యాదవ్..తాజాగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సమవారం లక్నోలో మీడియా సమావేశంలో మాట్లాడిన అఖిలేష్ యాదవ్…”ఎస్పీ నేతల ఫోన్లను యూపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది. నా ఆఫీస్ ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిరోజూ సాయంత్రం మా ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ను వింటున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అన్నీ నిఘా పర్యవేక్షణలో ఉన్నాయి. ఎస్పీ నేతలపై ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి. నా ప్రైవేట్ సెక్రటరీ జైనేంద్రయాదవ్ సహా ఇతర ఎస్పీ నేతలపై ఐటీ దాడులు..బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందనేదానికి ఓ సూచన. అన్ ఉపయోగి(పనికిరాని)ప్రభుత్వం నుంచి ఇంతకుమించి ఏమీ ఆశించలేం. బీజేపీ ప్రభుత్వం కేవలం వాట్సాప్ యూనివర్శిటీని మాత్రమే సమర్థవంతంగా నిర్వహించగలదు “అని అన్నారు. యూపీ+యోగి=ఉపయోగి అంటూ శనివారం యూపీ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలుకు ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు అఖిలేష్.యూపీ-యోగి=అన్ ఉపయోగి(పనికిరాని)అని అఖిలేష్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారం నుంచి వెళ్తూ ఇచ్చిన స్క్రిప్ట్పైనే బీజేపీ పనిచేస్తుందని,ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఎస్పీ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని అఖిలేష్ ఆరోపించారు.
మరోవైపు,యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఆరోపించారు. ఆదివారం యూపీలోని రాయబరేలీలో పర్యటించిన ప్రియాంక..యూపీలో యోగి సర్కార్ వ్యతిరేకంగా గట్టి పోరాటం చేస్తోంది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. యామావతి అసలు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదని..అఖిలేష్ యాదవ్ రెండు నెలల క్రితమే ప్రచారం ప్రారంభించాడని,ఒక్క కాంగ్రెస్ మాత్రమే యోగి సర్కార్ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతోవదని అన్నారు. కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి ప్రియాంకగాంధీ బరిలోకి దిగే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ప్రియాంక అధికారికంగా స్పందించలేదు.
ALSO READ KMC Polls 2021 : నాటు బాంబులతో దాడి..హింసాత్మకంగా కోల్‌కతా మున్సిపల్ ఎన్నికలు