దేశీయ విమానాలపై బ్యాన్ పొడగింపు…ఏప్రిల్-14వరకు ఎగరటానికి వీల్లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2020 / 03:22 PM IST
దేశీయ విమానాలపై బ్యాన్ పొడగింపు…ఏప్రిల్-14వరకు ఎగరటానికి వీల్లేదు

Updated On : March 27, 2020 / 3:22 PM IST

కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వారం రోజుల పాటు బ్యాన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు దేశీయ విమనసర్వీసులపై బ్యాన్ పొగడించబడింది. ఏప్రిల్ -14వరకు దేశీయ విమాన సర్వీసులపై బ్యాన్ కొనసాగుతుందని ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA ప్రకటించింది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ విమానసర్వీసులపై బ్యాన్ ను పొడిగించింది డీజీసీఏ. ఇప్పటికే ఏప్రిల్-15వరకు అంతర్జాతీయ విమాన రాకపోకలపై బ్యాన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కార్గో ఫైట్ లకు మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పటికే రైల్వే శాఖ కూడా గూడ్స్ మినహా అన్ని రైళ్ల రాకపోకలను నలిపివేసిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.