Employee Safety in J&K: కాశ్మీర్‌లో పీఎం ప్యాకేజీ ఉద్యోగులందరినీ జూన్ 6 నాటికి సురక్షిత ప్రాంతాలకు తరలింపు
కాశ్మీర్ డివిజన్‌లో పోస్ట్ చేయబడిన PM ప్యాకేజీ ఉద్యోగులందరిని మరియు మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన ఇతరులను వచ్చే సోమవారం (జూన్ 6) నాటికి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తాం" అని అన్నారు

Kashmir
Employee Safety in J&K: జమ్మూ కాశ్మీర్ లో కొన్ని ప్రాంతాల్లో నక్కి ఉన్న ఉగ్రవాద ముఠాలు గత కొన్ని రోజులుగా అమాయక ప్రజలపై దాడికి పాల్పడుతూ వారిని అతిదారుణంగా హతమారుస్తున్నారు. గడిచిన 20 రోజుల్లోనే ఉగ్రవాదాలు మూడు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మంగళవారం (మే 31న) కాశ్మీర్ లోయ సాంబా జిల్లాలో పండిట్ కుటుంబానికి చెందిన రజనీ బాలా అనే ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. గతంలో రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగిని, అమ్రీన్ భట్ అనే టీవీ నటిని ఉగ్రవాదులు హతమార్చారు. అయితే వరుస ఉగ్రదాడులతో కాశ్మీర్ లోయలో పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈక్రమంలోనే..కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని తమకు భద్రత కల్పించాలంటూ ప్రధానమంత్రి పునరావాస ప్యాకేజీ (PMRP) కింద ఉద్యోగాలు చేస్తున్న కాశ్మీరీ పండిట్లు డిమాండ్ చేస్తున్నారు.
Other Stories: Bin Laden: ‘ప్రపంచంలో ఉత్తమ జూనియర్ ఇంజనీర్’ అంటూ ‘బిన్ లాడెన్’ ఫోటో పెట్టుకున్న యూపీ విద్యుత్ అధికారి
దీనిపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..”కాశ్మీర్ డివిజన్‌లో పోస్ట్ చేయబడిన PM ప్యాకేజీ ఉద్యోగులందరిని మరియు మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన ఇతరులను వచ్చే సోమవారం (జూన్ 6) నాటికి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తాం” అని అన్నారు. కాశ్మీర్ లోని వివిధ జిల్లా కేంద్రాల్లో మొత్తం 4500 మంది వలస ఉద్యోగులు పనిచేస్తున్నారని..ఇప్పటికే 500 మంది నుంచి వచ్చిన అభ్యర్ధనలు మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. వారిలో 100 మంది దంపతులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ తరలింపు ప్రక్రియను తాము ఒప్పుకోబోమని..లోయ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిస్థితులు చక్కబడే వరకు తాము కదిలేందుకు సిద్ధంగా లేమని కొందరు పండిట్ వర్గీయులు పేర్కొన్నారు.
Other Stories: India – Bangladesh: భారత్ – బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ రైలు ప్రారంభం