India – Bangladesh: భారత్ – బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ రైలు ప్రారంభం

భారత్‌లోని పశ్చిమబెంగాల్‌లోని న్యూ‌ జలపాయ్‌గురి..నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా కంటోన్మెంట్ ఏరియాను కలుపుతూ 'మిటాలి ఎక్స్‌ప్రెస్' (ప్రజారవాణా) రైలు ప్రారంభం అయింది

India – Bangladesh: భారత్ – బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ రైలు ప్రారంభం

India Bangla

India – Bangladesh: భారత్ – బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తూ..రెండు దేశాల మధ్య మరో కీలక అడుగు పడింది. భారత్‌లోని పశ్చిమబెంగాల్‌లోని న్యూ‌ జలపాయ్‌గురి..నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా కంటోన్మెంట్ ఏరియాను కలుపుతూ ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ (ప్రజారవాణా) రైలు ప్రారంభం అయింది. బుధవారం భారత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్‌లు బుధవారం ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు. ఈమేరకు బెంగాల్‌లోని న్యూ జలపాయ్‌గురి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమాలో ఇరు దేశాల మంత్రులు పాల్గొన్నారు. న్యూ జలపాయ్‌గురి – ఢాకా కంటోన్మెంట్ మధ్య..బుధ, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.

Other Stories: Population Control Bill: జనాభా నియంత్రణకు త్వరలో చట్టం: కేంద్ర మంత్రి

కాగా, ఇప్పటికే భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉండగా..బుధవారం మరో ప్రత్యేక రైలు ఇరుదేశాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా వరకు మైత్రీ రైలు, కోల్‌కతా నుంచి ఖుల్నా వరకు బంధన్ ఎక్స్ప్రెస్ అనే రెండు రైళ్లు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ భారత్‌లో 69 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లో 526 కిలోమీటర్లు ప్రయాణించనుంది.

Other Stories: Khalistani groups: తీహార్ జైలు నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ‘ఖలిస్థాన్’ ఉగ్రవాద ముఠాలు

ఆది, బుధవారాల్లో ఉదయం 11.45 గంటలకు(భారత కాలమానం ప్రకారం) న్యూ జలపాయ్‌గురి జంక్షన్ నుండి ప్రారంభమై.. ఒక రాత్రి ప్రయాణం అనంతరం సోమ, గురువారాల్లో బంగ్లాదేశ్ ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి 9.15 గంటలకు ఢాకా చేరుకుంటుంది. పూర్తి ఏసీ కోచ్‌లు కలిగిన ఈ ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’లో నాలుగు చైర్ కార్లు మరియు నాలుగు స్లీపర్ కోచ్‌లు ఉన్నాయని, ఈ రైలు బంగ్లాదేశ్ మరియు ఉత్తర పశ్చిమ బెంగాల్ మధ్య పర్యాటకం, వాణిజ్యానికి మరిన్ని అవకాశాలను అందిస్తుందని ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) ప్రతినిధి సబ్యసాచి డే అన్నారు.