Khalistani groups: తీహార్ జైలు నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ‘ఖలిస్థాన్’ ఉగ్రవాద ముఠాలు

దిల్లీలోని తీహార్ జైలులో బందీలుగా ఉన్న గ్యాంగ్‌స్టర్లను ఖలిస్తానీ గ్రూపులు తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Khalistani groups: తీహార్ జైలు నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ‘ఖలిస్థాన్’ ఉగ్రవాద ముఠాలు

Khalistan

Khalistani groups: ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ భారీ కుట్రలకు తెరలేపినట్టు తెలుస్తుంది. పంజాబ్ రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం ఖలిస్థాన్ వేర్పాటువాదుల కదలికలు పెచ్చుమీరుతున్నాయి. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ భవన గోడలపై ఖలిస్థాన్ ఉగ్రవాద జెండాలు దర్శనం ఇవ్వడంతో పాటు..వేర్పాటువాదులు నినాదాలు కూడా గోడలపై రాశారు. తాజాగా మరోమారు ఖలిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి సారించిన నిఘావర్గాలకు సరికొత్త విషయాలు తెలిసాయి. దిల్లీలోని తీహార్ జైలులో బందీలుగా ఉన్న గ్యాంగ్‌స్టర్లను ఖలిస్తానీ గ్రూపులు తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జైలులో ఉన్న నేరస్థులు తమ కార్యకలాపాలను యధేశ్చగా కొనసాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

Other Stories: Kashmiri Pandits: కాశ్మీరీ పండిట్లని బంధించడం న్యాయమా: కేజ్రీవాల్

దాదాపు 17-18 మంది టాప్ గ్యాంగ్‌స్టర్లు తీహార్ జైలులో ఉన్నారని, వారు ఇప్పటికీ తమ ఉగ్రవాద కార్యకలాపాలను సాపేక్షంగా సులభంగా నిర్వహించగలరని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డబ్బు కోసం తీహార్ జైలు సిబ్బందే వారికి సహాయం చేస్తున్నట్టు గుర్తించిన నిఘావర్గాలు.. జైలు సిబ్బంది పాత్రపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. కొంతమంది జైలు సిబ్బంది.. బ్యారక్ లోపల ఫోన్లు మరియు సిమ్ కార్డులను సరఫరా చేయడానికి భారీ మొత్తాలను వసూలు చేస్తున్నట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్థాన్ వేర్పాటువాదులు కెనడా నుంచి భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్లను ఉసిగొల్పుతున్నట్టు తెలిసింది.

Other Stories: Rahul Gandhi: మోదీ జీ.. ఇది సినిమా కాదు.. క‌శ్మీర్‌లోని వాస్త‌వ ప‌రిస్థితులు: రాహుల్ గాంధీ

భారత్‌లో ప్రముఖ గాయకులను గుర్తించి వారి నుంచి కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పంజాబీ గాయకుడు మన్‌కీర్త్ ఔలాఖ్ కూడా వీరి జాబితాలో ఉన్నాడు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం ఔలాఖ్ సైతం తనకు వ్యక్తిగత భద్రత కల్పించాలని అధికారులను కోరాడు. ఇదిలాఉంటే కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. సిద్ధూ మూసేవాలా హత్యకు తామే బాధ్యులమని ప్రకటించాడు. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడైన బ్రార్..కెనడా నుంచి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.