ఇది ఏంటో చెప్పండి చూద్దాం

ఇది ఏంటో చెప్పండి చూద్దాం

birthday cake

Updated On : February 24, 2021 / 4:56 PM IST

Amazon box cake : ఈ ఫొటోలో ఉన్నది ఏంటో చెప్పండి చూద్దాం..అనే ప్రశ్నకు ఏం సమాధానం ఉంటుంది. అంతా క్లియర్ గా కనిపిస్తుంటే. ఏవరైనా అమెజాన్ లో ఆర్డర్ చేస్తే..వచ్చిన పార్సిల్ అని అంటారు కదా..అయితే..మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే..అది పార్సిల్ కాదు అనగానే ఆశ్చర్యపోతారు కదా. మరి అచ్చు అమెజాన్ పార్సిల్ కనిపిస్తున్నది ఏంటీ అని బుర్ర గొక్కుంటారు.

బర్త్ డేలు, మ్యారేజ్ డే..ఇతర శుభకార్యాలు, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకుంటే..అందులో కేక్ ఉండాల్సిందే. కేక్ కట్ చేసి విషెష్ తెలియచేస్తుంటారు. ఒక కేక్ ల్లో ఎన్నో రకాలు, వెరైటీలు ఉంటుంటాయి. తమకు నచ్చిన విధంగా ఆర్డర్ చేసుకుంటూ..అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు కొందరు. తయారీదారులు (బేకర్స్) కూడా..వారికి కావాల్సినట్లు తయారు చేస్తుంటారు. తాజాగా..వినూత్నంగా ఉన్న ఓ కేక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమెజాన్ పార్సిల్ రూపంలో ఉన్న కేక్ కావడం అందర్నీ ఆకట్టుకొంటోంది.

అచ్చం అమెజాన్ నుంచి వచ్చే ప్యాకేజ్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఈ కేక్ ఉంది. యజమాని కొడుకు పుట్టిన రోజు కోసం ఈ కేక్ తయారు చేశారు. Nina’s Cake Cabin కేక్ ను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. అమెజాన్ పార్సిల్ కేక్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కేక్ పై మీమ్స్ సృష్టిస్తున్నారు. That is amazing, U r really talented, cake looks delicious too అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.