అంబేద్కర్ స్మారక వనానికి రూ. 1000 కోట్లు

  • Published By: madhu ,Published On : January 15, 2020 / 04:34 AM IST
అంబేద్కర్ స్మారక వనానికి రూ. 1000 కోట్లు

Updated On : January 15, 2020 / 4:34 AM IST

ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే..నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే..దానికయ్యే వ్యయం తడిసిమోపేడవుతుంది. ఇలాగే..ముంబైలో నిర్మించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహంలో ఇదే జరిగింది. దాదాపుగా రూ. 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2017 డిసెంబర్ నెలలో రూ. 709 కోట్లు అవుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం దీని వ్యయం భారీగా పెరిగిపోయింది.

ప్రాజెక్టు అమలులో జాప్యం, విగ్రహం యొక్క  ఎత్తును పెంచడానికి..మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా వ్యయం పెరిగిపోయిందని అంటున్నారు. 2012లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని భావించిన సమయంలో దీని ఖ ర్చు రూ. 425 కోట్లుగా అంచనా వేశారు. విగ్రహం ఏర్పాటులో మరిన్ని మార్పులు చేయాలని కొత్త థాకరే ప్రభుత్వం సూచించినట్లు వర్గాలు వెల్లడించాయి. 12 ఎకరాల స్థలంలో ఈ విగ్రహం ఏర్పాటు కానుంది. ఇందులో లైబ్రరీ, చావదార్ చెరువు ప్రతిరూపం, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యయం పెరగడం విషయాన్ని MMRDA ప్రభుత్వానికి తెలియచేసింది.

దీనిని కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. షపూర్జీ పాలోంజీ గ్రూప్ ప్రాజెక్టుకు సంబంధించి బిడ్ వేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మహా వికాస్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ ప్రవేశ పెట్టిన మార్పును థాకేరే ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. మున్సిపల్ కౌన్సిల్స్ అధ్యక్ష, ప్రత్యక్ష ఎన్నికలను నిలిపివేయాలని థాకరే ప్రభుత్వం యోచిస్తోంది. 2016, మే నెలలో ఫడ్నవీన్ ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడానికి ముందు..శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ రూపొందించిన ప్రోగ్రాంలో వెల్లడించాయి. 

Read More : ఖేల్ ఇండియా గేమ్‌లో నాలుగు స్వర్ణాలు