Omicron scare : కేసులు పెరుగుతున్నా మారని ప్రజల వైఖరి..టూర్లు ప్లాన్ చేసుకున్న 58 శాతం ప్రజలు!

కొందరు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోగా...మరికొందరు ఎక్కడికి వెళ్లాల్లో డిసైడ్ చేసుకుని..టికెట్లు బుక్‌ చేసుకునేందుకు సిద్దమవుతున్నారని సర్వే వెల్లడిస్తోంది.

Omicron scare : కేసులు పెరుగుతున్నా మారని ప్రజల వైఖరి..టూర్లు ప్లాన్ చేసుకున్న 58 శాతం ప్రజలు!

Tour Covid

Updated On : December 26, 2021 / 1:58 PM IST

 58% Indians Plan To Travel : ఓ వైపు కరోనా..మరోవైపు ఒమిక్రాన్..ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి ఈ వైరస్ లు. దీంతో పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారతదేశంలో కూడా ఈ వైరస్ లు వేగంగా వ్యాపిస్తున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. కానీ..కొంతమంది మాత్రం…మాకేమి అవుతుంది లే..అనుకుంటున్నారు. బయటకు వచ్చినప్పుడు కనీసం మాస్క్ లు కూడా ధరించడం లేదు. ఇంకొన్ని రోజుల్లో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : Rowdy Boy Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మంచి మనస్సు..పేదవారికి రూ. 10 లక్షల సహాయం

కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా…వారికి చీమకుట్టినట్లయినా అనిపించడం లేదు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో సందడి చేస్తున్నారు. పండుగలకు అందరినీ పిలుచుకుని వేడుకలు చేసుకుంటున్నారు. అంతేకాదండోయ్…ఎంజాయ్ చేసేందుకు టూర్లకు కూడా సిద్ధమైపోతున్నారు కొందరు. సెలవుల్లో పర్యాటక ప్రాంతాలకు, సొంతూళ్లకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. వచ్చే మూడు నెలల్లో 58శాతం భారతీయులు యాత్రలు, ఇతర ప్రయాణాలు చేయనున్నారని తేలింది. ఈ ప్రయాణలన్నీ మార్చిలోపు ఉన్నాయంట. సర్వే కోసం దేశంలోని 320 జిల్లాల్లో 19 వేల 500 మంది అభిప్రాయం తీసుకోవడంతో పాటు రైలు, రోడ్, విమాన ప్రయాణాలను, టికెట్ల బుకింగ్‌ను పరిశీలించారు. సెకండ్ వేవ్‌కు ముందు కూడా ఇలాగే జరిపిన సర్వేలో 50శాతం మంది ప్రయాణాలకు ప్రణాళిక వేసుకున్నారు. సెకండ్‌వేవ్‌ విధ్వంసం కళ్లారా చూసిన తర్వాత కూడా ప్రజల వైఖరిలో మార్పు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

Read More : Corona In France : ఫ్రాన్స్ లో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు

కొందరు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోగా…మరికొందరు ఎక్కడికి వెళ్లాల్లో డిసైడ్ చేసుకుని..టికెట్లు బుక్‌ చేసుకునేందుకు సిద్దమవుతున్నారని సర్వే వెల్లడిస్తోంది. ఇంకొందరు..ఎక్కడికి వెళ్లాలి అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. కొంతమంది మాత్రం పండుగల సమయంలో తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను, బంధువులను కలిసేందుకు వెళ్తున్నట్లు పేర్కొంది. 18 శాతం ప్రజలు ఎక్కడికి వెళ్లాలి అనేదాన్ని నిర్ణయించుకుని టికెట్లు బుక్‌ చేసుకున్నారని, మరో 15 శాతం ప్రజలు ఎక్కడికి వెళ్లాలనేది డిసైడ్ చేసుకున్నారు కానీ..ఇంకా టికెట్లు బుక్ చేసుకోలేదని తెలిపింది. ఇంకా 22శాతం ప్రజలు…అనుకున్న తేదీ సమీపించాకే…దగ్గరలో ఉన్న ఏ ప్రదేశాలకు వెళ్లాలనే దానిపై నిర్ణయించుకోనున్నారని వెల్లడించింది. దీనిబట్టి చూస్తే…దేశంలో చాలా మంది ప్రజలు ప్రయాణాలు, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువసమయం గడపనున్నారని అర్థమౌతోంది. డెల్టా కన్నా మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోందని తెలిసినా…మనదాకా రాదులే..అన్న నిర్లక్ష్యం వీడడం లేదని….ఈ ఆలోచనే ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.