Nagaland Encounter : పౌరులపై ఆర్మీ కాల్పులకు కారణాలేంటో చెప్పిన అమిత్ షా

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో శనివారం కూలీల‌పై సైన్యం కాల్పులు జరిపిన ఘటనపై ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రకటన చేశారు. మాన్‌లోని ఓటింగ్​ ప్రాంతంలో

Nagaland Encounter : పౌరులపై ఆర్మీ కాల్పులకు కారణాలేంటో చెప్పిన అమిత్ షా

Amith Shah

Nagaland Encounter :  నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో శనివారం కూలీల‌పై సైన్యం కాల్పులు జరిపిన ఘటనపై ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రకటన చేశారు. మాన్‌లోని ఓటింగ్​ ప్రాంతంలో తిరుగుబాటుదారులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతోనే సైన్యం ఆపరేషన్​ చేపట్టిందన్నారు. ఆపరేషన్ లో భాగంగా అనుమానాస్ప‌ద ప్రాంతంలో సుమారు 21 మంది క‌మాండోలు రంగంలోకి దిగి..పేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆ వాహ‌నం ఆగ‌కుండా వెళ్లింద‌న్నారు.

ఆదేశాలిచ్చినా.. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడం వల్ల ఆ వాహ‌నంలో తీవ్ర‌వాదులను త‌ర‌లిస్తున్న‌ట్లు కమాండోలకు అనుమానం మరింత పెరిగి కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌ని షా తెలిపారు. దీంతో వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు మరణించారని అమిత్​ షా తెలిపారు . అయితే వారు తిరుగుబాటుదారులు కారని, పౌరులను తర్వాత తెలిసినట్టు వివరించారు. గాయపడ్డ ఇద్దరు పౌరులను సైనికులే సమీప హాస్పిటల్ కు తీసుకెళ్లారని స్పష్టం చేశారు.

ఈ ఘ‌ట‌న త‌ర్వాత గ్రామ‌స్తులు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి, రెండు వాహ‌నాలు ధ్వంసం చేశార‌ని, సైనికుల‌పై తిర‌గ‌బ‌డ్డార‌ని హోంమంత్రి తెలిపారు. గ్రామ‌స్థుల తిరుగుబాటులో ఓ సైనికుడు మృతిచెందిన‌ట్లు వెల్ల‌డించారు. ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం సైనికులు ఫైరింగ్ జ‌రిపార‌న్నారు. కాల్పుల వ‌ల్ల మ‌రో ఏడు మంది పౌరులు మృతిచెందిన‌ట్లు షా తెలిపారు. పౌరులపై కాల్పులు జరపడం దురదృష్ట కరమని అన్నారు. 14 మంది పౌరుల మృతి పట్ల కేంద్రం విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ప్రస్తుతం ఓటింగ్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, అయితే పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని షా తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని ఆదివారం నాగాలాండ్ డీజీపీ, క‌మీష‌న‌ర్ ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని ఆదివారం సందర్శించారన్నారు. ఈ ఘటనపై సిట్​ను ఏర్పాటు చేసి, నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించినట్టు అమిత్ షా తెలిపారు. మృతుల కుటుంబాల‌కు షా ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. పౌరులపై కాల్పులు జరపడం దురదృష్ట కరమని అన్నారు. 14 మంది పౌరుల మృతి పట్ల కేంద్రం విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మరోవైపు, నాగాలాండ్​లో పౌరులపై బలగాలు కాల్పుల ఘటనపై భారత సైన్యం ‘కోర్ట్​ఆఫ్ ఎంక్వైరీ’ని ఏర్పాటు చేసింది. ఈశాన్య భారత్​ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్ జనరల్​ ర్యాంకు అధికారి అధ్యక్షుడిగా ఉంటారని పేర్కొంది.

ALSO READ Wasim Rizvi : ఇస్లాం వదిలి..హిందూ మతంలోకి యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్

ALSO READ Nagaland Burning : నాగాలాండ్‌లో కాల్పులు..పెరిగిన మృతుల సంఖ్య.. జవాన్లపై హత్యానేరం కేసు