Man claims his boss : ఆఫీస్‌లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నందుకు బాస్ అరిచాడట.. ఉద్యోగి పెట్టిన పోస్ట్ వైరల్
కొంతమంది బాస్‌ల నుంచి విచిత్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ బాస్ ఆఫీస్‌లో సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టినందుకు కంపెనీ కరెంట్ దొంగిలిస్తున్నావంటూ ఉద్యోగిపై అరిచాడట. ఆ ఉద్యోగి బాస్ వల్ల పడిన బాధను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

Man claims his boss
Man claims his boss : ఏ జాబ్ లో అయినా కాస్తో కూస్తో ఒత్తిడి ఉండకుండా అయితే ఉండదు. బాస్ నుంచి సరైన సపోర్ట్ లేని ఆఫీసుల్లో ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది వృత్తిపరంగా తాము ఎదుర్కుంటున్న ఎన్నో అనుభవాలు, సవాళ్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా రెడ్డిట్‌లో ఓ ఉద్యోగి తన బాస్ గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Employee chat viral : ఫుల్లుగా తాగి అర్ధరాత్రి బాస్‌కి మెసేజ్ చేసిన ఉద్యోగి.. ఆ తరువాత ఏం జరిగింది?
ఓ ఉద్యోగి తన ఆఫీస్‌లో ఎదుర్కుంటున్న విచిత్రమైన పరిస్థితిని రెడ్డిట్ పోస్ట్‌లో షేర్ చేసుకున్నాడు. @మెలోడిక్-కోడ్-2594 (Melodic-Code-2594 ) అనే రెడ్డిట్ ఖాతాదారుడు ఆఫీసులో తన ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టినందుకు బాస్ తనపై అరిచినట్లు పోస్ట్ పెట్టాడు. ‘నేను వ్యక్తిగత అవసరాలకోసం కంపెనీ విద్యుత్ దొంగిలిస్తున్నానంటూ ఆఫీస్‌లో బాస్ నా మీద అరిచాడు. అబ్బాయిలు మీరంతా ఏమనుకుంటున్నారు? నేను రోజంతా ఫోన్‌లో ఉండను. నేను పడుకునే ముందు రాత్రి ఫోన్ ఛార్జ్ చేయడం మర్చిపోతాను. ఇది డెస్క్ జాబ్’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అతని పోస్టు చదివి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇక అందరూ అలాంటి బాస్‌ని ఖచ్చితంగా తిడతారు కదా.
‘ఆఫీస్‌లో మీ ఫోన్ ఛార్జ్ చేయనని చెప్పండి.. మీరు ఆఫీస్ కాల్స్ కూడా తీసుకోరు. అప్పుడు కంపెనీ మీ టాక్ టైం, బ్యాటరీ జీవితాన్ని దొంగిలిస్తుంది’ అని .. ‘కంపెనీ నీటిని దొంగిలిస్తున్నందుకు టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఫ్లష్ చేయవద్దని మీ బాస్‌కి చెప్పండి’ అని చమత్కారంగా కామెంట్లు పెట్టారు. ఈ పోస్టును పెట్టిన వ్యక్తి మరలా ‘నాపై అరిచిన మా బాస్ ఈ నెలాఖరులో జాబ్ వదిలేస్తున్నట్లు మా టీమ్ చేసిన అనౌన్స్ మెంట్‌తో ఈరోజే తెలిసింది. వెళ్లిపోయే ముందు ఆయన నా మీద ప్రతాపం చూపిస్తున్నాడు’ అంటూ మరో పోస్టు యాడ్ చేశాడు. మొత్తానికి ఈ పోస్టు వైరల్ అవుతోంది.
Is charging your personal phone while at work considered stealing electricity?
by u/Melodic-Code-2594 in antiwork