Abdul Kalam : బహుమతికి కూడా డబ్బు చెల్లించిన అబ్దుల్ కలాం.. కలాం ఇచ్చిన చెక్కును ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నకంపెనీ

భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంను దేశంలో ఎంతోమంది అభిమానిస్తారు. జీవించినంత కాలం ఎంతో సింపుల్ గా నిజాయితీగా ఉన్నారాయన. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తనకు బహుమతిగా ఇచ్చిన వస్తువుకి కూడా డబ్బు చెల్లించిన వ్యక్తి కలాం. అందుకు సంబంధించిన ఓ సంఘటన చదవండి. ఎంతో స్ఫూర్తి కలుగుతుంది.

Abdul Kalam : బహుమతికి కూడా డబ్బు చెల్లించిన అబ్దుల్ కలాం.. కలాం ఇచ్చిన చెక్కును ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నకంపెనీ

MV Rao IAS

Abdul Kalam- MV Rao IAS : భారతదేశంలో అత్యంత అభిమానించే వ్యక్తుల్లో ఒకరు మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం.. జూలై 27, 2015 లో ఆయన మరణించారు. విద్యావేత్త, ఏరోస్పేస్ శాస్త్రవేత్త అయిన కలాం మరణించి 8 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో దేశం ఆయనకు నివాళులు అర్పించింది. తన నిజాయితీ, నిబద్ధతతో చాలామందికి ఆదర్శంగా నిలిచారాయన. బహుమతులు, మర్యాదలు స్వీకరించకూడదనే ఆయన సూత్రాన్ని గుర్తు చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ ఎమ్.వి. రావు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

Anand Mahindra : ‘ఆయన గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నా’.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

కలాం తన దైనందిన జీవితంలో ఎంత నిజాయితీగా జీవించారో తెలియజేసే ఒక సంఘటనను ఐఏఎస్ ఆఫీసర్ ఎమ్.వి. రావు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తనకు బహుమతిగా పంపిన వస్తువుకి సైతం డబ్బులు చెల్లించిన వ్యక్తిగా కలాం నిలిచారు. 2014 లో కలాం ముఖ్య అథితిగా హాజరైన ఓ కార్యక్రమానికి ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే కంపెనీ స్పాన్సర్‌గా ఉందట. కార్యక్రమం అనంతరం కలాంగారికి ఒక గ్రైండర్‌ను బహుమతిగా ఇస్తే అందుకు కలాం తిరస్కరించారట. స్పాన్సర్ పట్టుబట్టడంతో దానిని తీసుకున్నా మరుసటి రోజు ఆ గ్రైండర్ మార్కెట్ విలువ తెలుసుకుని కంపెనీకి రూ.4,850 చెక్ పంపించారట కలాం. అయితే ఆయన పంపిన చెక్‌ను డిపాజిట్ చేయకూడదని కంపెనీ నిర్ణయించిందట.

UP Farmer Climbs Tree: పగబట్టిన ఎద్దు.. రెండు గంటలు చెట్టుపైనే రైతు.. వీడియో వైరల్.. అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర ట్వీట్

కొద్దిరోజులకి కలాం తన ఖాతా నుంచి గ్రైండర్ కంపెనీ వారు డబ్బులు తీసుకోలేదని తెలుసుకుని ‘చెక్కును డిపాజిట్ చేస్తారా?  లేదంటే గ్రైండర్‌ను తిరిగి పంపమంటారా?’ అని కంపెనీని అడిగారట. ఇక కంపెనీ వారు ఆ చెక్‌కు ఫోటో తీసి ఫోటోను ఫ్రేమ్ కట్టించుకున్నారట. ఇక చెక్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో డిపాజిట్ చేసారట. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ ఎమ్.వి. రావు తన ట్విట్టర్ ఖాతాలో (@mvraoforindia) పోస్టు పెట్టారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ఎంత గొప్ప వ్యక్తి.. ప్రజా జీవితంలో ఎంత నీతిగా జీవించారు’.. అంటూ నెటిజన్లు కలాంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.