Mumbai : ఆ ఇంటి 13 వ అంతస్తులో ఇండియన్ రాక్ పైథాన్ ప్రత్యక్షం.. ఉలిక్కిపడ్డ ముంబయి వాసులు
ఇండియన్ రాక్ పైథాన్.. దాదాపుగా 4 అడుగులు ఉంటుంది. ఎటు నుంచి వచ్చిందో ముంబయిలోని ఓ టవర్ 13 వ అంతస్తుకి చేరుకుంది. సిమెంట్ పేస్ట్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతూ అక్కడి వారి కంటపడింది. ఎంతో కష్టపడి దానిని అక్కడి నుంచి తరలించారు.

Mumbai
Mumbai : కొండచిలువలు గ్రామాల్లోకి రావడం తెలిసిందే.. ఇటీవల నగరాల్లోకి కూడా అడుగుపెడుతున్నాయి. ముంబయిలో నిర్మాణంలో ఉన్న టవర్ 13వ అంతస్తులో ఓ కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో.. అంత పై వరకూ ఎలా వెళ్లిందో తెలియన స్ధానికులు షాకయ్యారు.
ముంబయిలోని ఘాట్ కోపర్‌లో పన్నెండు అంతస్టుల టవర్ గ్రిల్డ్ టెర్రస్ పైకి ఎక్కింది ఇండియన్ రాక్ పైథాన్. దాదాపుగా నాలుగు అడుగుల పొడవున్న ఈ రాక్ కొండచిలువను చూసి జనం షాకయ్యారు. ఈ కొండచిలువను పట్టుకుని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ MR భోయిర్‌కు అప్పగించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.. అసలు అంత ఎత్తు వరకూ ఎలా వెళ్లిందో తెలియక ఆందోళన చెందారు.
Boy playing with a python : కొండచిలువతో ఆడుకుంటున్న పసివాడు.. పేరెంట్స్‌ని తిట్టిపోస్తున్న జనం
కొండచిలువ చిలువ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే టవర్‌లో నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో అక్కడ ఉన్న సిమెంట్ పేస్ట్‌లో చిక్కుకుంది. మొత్తానికి దానిని రెస్క్యూ చేసి అక్కడి నుంచి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.