కరోనా స్పెషల్.. ఆనంద్ మహీంద్రాకు స్పెషల్ గిఫ్ట్

Anand-Mahindra
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు తన ఫ్రెండ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. సోషల్ మీడియాలో అప్‌డేటెడ్‌గా ఉండే ఆయన.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అశోక్ కురియన్ అనే నా ఫ్రెండ్ N95 రీ యూజబుల్ మాస్క్ గిఫ్ట్ గా ఇచ్చాడని ట్విట్టర్ ద్వారా పొగిడేశారు. పనిలో పనిగా ఆ మాస్క్‌పై మార్కెటింగ్ కూడా చేసేశఆరు. (ఢిల్లీ వ్యక్తికి కరోనా….700మంది ఆఫీస్ ఉద్యోగులంతా దిగ్భందనం)
ఈ మాస్క్‌ను ఉతుక్కోవచ్చు. వైరస్ ను నాశనం చేసేయొచ్చు. మళ్లీ వాడుకోవచ్చు. ఇండియాలో మాస్క్ ఉత్పత్తులు పెంచాలనుకుంటుందని ఆనంద్ మహీంద్రా అన్నాడు. భారత్‌లో ప్రస్తుతం 78కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వస్తున్న కరోనాను అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 15వరకూ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అంతేకాకుండా ప్రజలు గుమిగూడి ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదని, వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 200కు మించి ప్రజలు పోగవడాన్ని నిషేదించింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా ఐపీఎల్ మ్యాచ్ లను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా ఐపీఎల్ రద్దు చేయాలనుకున్నా.. వాయిదా వేసేందుకే సిద్ధమైంది మేనేజ్‌మెంట్.
శుక్రవారం ఉదయం బెంగళూరులో పనిచేస్తున్న గూగుల్ ఎంప్లాయ్‌కి కరోనా లక్షణాలు కనిపించడంతో అతణ్ని ఐసోలేషన్ వార్డుకు పంపిస్తూ.. మిగిలిన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసింది. ఆ వ్యక్తి ఇటీవలే గ్రీస్ ప్రాంతానికి వెళ్లి తిరిగొచ్చాడని వైద్యలు తెలిపారు. అతనెవరెవరిని కలిశాడో విచారణ జరిపి.. టెస్టులు నిర్వహించే పనిలో పడ్డారు.
?????? to my friend Ashok Kurien, who sent me the best gift for these times! Proud to learn that an Indian inventor’s Swiss company has come out with these washable,reusable masks that destroy viruses. They’re stepping up production in India. https://t.co/uZv23cAM7j pic.twitter.com/YFawmDhvcY
— anand mahindra (@anandmahindra) March 13, 2020
See Also | వృత్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్..ప్రవృత్తి సోషల్ మీడియాలో అమ్మాయిలకు వల