అలెక్సాతో ఇలా ప్రాణాలు కాపాడుకున్న బాలిక.. ఆమె తెలివికి మెచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర

Anand Mahindra: నికితా ఫ్రిజ్‌పై ఉన్న అలెక్సా డివైజ్ ను చూసింది. కుక్క మొరిగే శబ్దాన్ని ప్లే చేయాలని..

అలెక్సాతో ఇలా ప్రాణాలు కాపాడుకున్న బాలిక.. ఆమె తెలివికి మెచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర

Alexa

ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో ముప్పు పొంచి ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే, అదే ఏఐను తెలివిగా వాడుకుంటే మన ప్రాణాలు కాపాడుతుందని నిరూపించింది ఓ అమ్మాయి. ఏఐతో తన ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా, 15 నెలల పాప ప్రాణాన్నీ కాపాడింది ఆమె.

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన నికిత (13) అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను వాడి కోతుల దాడి నుంచి బయటపడింది. నికిత తమ ఇంట్లో మేనకోడలు వామిక (15 నెలలు) ఆడుకుంటోంది. ఆ ఇతర కుటుంబ సభ్యులు వేర్వేరు గదుల్లో ఉన్నారు.

ఒక్కసారిగా ఐదారు కోతులు వారి ఇంట్లోకి దూసుకొచ్చాయి. వంటగదిలోని పాత్రలు, ఆహార పదార్థాలను ధ్వంసం చేశాయి. అవి తమ దగ్గరకు రావడంతో నికిత, వామిక భయపడిపోయారు. నికితా ఫ్రిజ్‌పై ఉన్న అలెక్సా డివైజ్ ను చూసింది. కుక్క మొరిగే శబ్దాన్ని ప్లే చేయాలని చెప్పింది. దీంతో వాయిస్ కమాండ్‌ను స్వీకరించిన అలెక్సా నుంచి కుక్క మొరిగే శబ్దాలు వచ్చాయి. కోతులు భయపడిపోయి బాల్కనీ నుంచి పారిపోయాయి.

ఆమెకు జాబ్ ఇస్తాం: ఆనంద్ మహీంద్ర
అలెక్సాను వాడి కోతులను తరిమేసిన నికిత ఐడియా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. ఆమె వెంటనే ప్రతిస్పందించిన తీరును ఆనంద్ మహీంద్ర మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంతేకాదు, ఆమె చదువు పూర్తికాగానే, కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటే ఆమెకు తమ కంపెనీలో జాబ్ ఇస్తామని చెప్పారు.

Also Read: నడిరోడ్డుపై ఇలా కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నావేంటీ? ఇంతకూ ఏ కంపెనీలో పనిచేస్తున్నావ్?