Anand Mahindra: నీరజ్‌ను బాహుబలితో పోల్చిన ఆనంద్ మహీంద్రా.. ఇస్తోన్న గిఫ్ట్ ఇదే!

మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. దేశంలో ఎవరు ఏది సాధించినా తనవంతుగా అభినందిస్తూ ఉంటారు.

Anand Mahindra: నీరజ్‌ను బాహుబలితో పోల్చిన ఆనంద్ మహీంద్రా.. ఇస్తోన్న గిఫ్ట్ ఇదే!

Mahindra Group chairman Anand Mahindra.

Updated On : August 8, 2021 / 7:22 AM IST

Neeraj Chopra: మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. దేశంలో ఎవరు ఏది సాధించినా తనవంతుగా అభినందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుపించారు ఆనంద్ మహీంద్ర. విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన నిరజ్ చోప్రాను బాహుబలితో పోలుస్తూ.. మేమంతా నీ సైన్యం, బహుబలి అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. స్వర్ణం సాధించిన నీరజ్‌కు ఓ గిఫ్ట్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మహీంద్ర.

అలాగే, ఒలింపిక్స్ గేమ్స్‌లో నిర్వ‌హించే జావెలిన్ త్రో గేమ్ స్మార‌కార్థం విడుద‌ల చేసే కాయిన్స్‌లో నీర‌జ్ చోప్రా ఫోటోను పెట్టి కొత్త‌గా విడుదల చెయ్యాలంటూ సూచిస్తూ మ‌రో ట్వీట్ చేశారు మహీంద్ర. ఈ ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఈ ట్వీట్‌లకు సంబంధించి ఓ నెటిజన్ నీరజ్‌కు XUV700 కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరగా.. నెటిజ‌న్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మ‌హీంద్రా.. అయ్యో.. త‌ప్ప‌కుండా.. మ‌న గోల్డెన్ అథ్లెట్‌కు XUV700 గిఫ్ట్‌గా ఇవ్వ‌డం నా అదృష్టం. నాకు కూడా గౌరవమే. అంటూ మ‌హీంద్ర కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల‌ను ఆ పోస్ట్‌లో ట్యాగ్ చేస్తూ వెంట‌నే ఒక XUV700ని నీర‌జ్ చోప్రా కోసం సిద్ధం చెయ్యాలని ట్వీట్ చేశారు. దీంతో ఆనంద్ మహీంద్రపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.