Madhya Pradesh : భోపాల్‌లో దుర్గామాత భక్తులపై దూసుకెళ్లిన కారు

ఛత్తీస్‌ఘడ్ కారు ప్రమాదం మరువకముందే మధ్యప్రదేశ్‌లో మరొకటి జరిగింది. దుర్గా నిమజ్జనానికి వెళ్తున్న భక్తులను ఢీకొంటూ కారు దూసుకొచ్చింది.

Madhya Pradesh : భోపాల్‌లో దుర్గామాత భక్తులపై దూసుకెళ్లిన కారు

Madhya Pradesh

Updated On : October 17, 2021 / 1:29 PM IST

Madhya Pradesh : ఛత్తీస్‌ఘడ్ కారు ప్రమాదం మరువకముందే మధ్యప్రదేశ్‌లో మరొకటి జరిగింది. దుర్గా నిమజ్జనానికి వెళ్తున్న భక్తులను ఢీకొంటూ కారు దూసుకొచ్చింది. బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో భక్తులు కారును నిలిపేందుకు ప్రయత్నించారు. దీంతో కారు డ్రైవర్ రివర్స్‌లో వెళ్లి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి : Barabanki accident: ఆవును తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి

మరోవైపు మూడు రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్‌ జష్‌పూర్‌లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాద సమయంలో ఓ వ్యక్తి మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదం అనంతరం స్థానికులు కారును ధ్వంసం చేశారు. ఇక కారును పరిశీలించిన పోలీసులు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనలో ఇద్దరిని అదుపులోకీ తీసుకున్నారు పోలీసులు.

చదవండి : Madhapur Road Accident : నిశ్చితార్ధం జరిగింది…త్వరలో పెళ్లి…. ఇంతలోనే….!