Madhya Pradesh : ఆమె జీతం 30,000.. ఆస్తులు రూ.7 కోట్లు.. ఆ ప్రభుత్వ ఉద్యోగిని అవినీతి చిట్టా చూస్తే షాకవుతారు

ఆమె జీతం అక్షరాల 30 వేల రూపాయలు. 10 సంవత్సరాల సర్వీసులో ఆమె కూడబెట్టింది 7 కోట్లపైనే. ఆమె అవినీతి చిట్టా చూసిన అవినీతి నిరోధక అధికారులు నోరెళ్లబెట్టారు.

Madhya Pradesh : ఆమె జీతం 30,000.. ఆస్తులు రూ.7 కోట్లు.. ఆ ప్రభుత్వ ఉద్యోగిని అవినీతి చిట్టా చూస్తే షాకవుతారు

Madhya Pradesh

Updated On : May 12, 2023 / 5:40 PM IST

Madhya Pradesh- ACB :  ఆమె వయసు 36 సంవత్సరాలు.. 10 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం.. కానీ ఆమె ఆస్తులు రూ. 7 కోట్లకు పైనే. మధ్యప్రదేశ్ లో అవినీతి నిరోధక అధికారులు జరిపిన దాడుల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగిని అవినీతి (Corruption) చిట్టా చూస్తే నోరెళ్ల బెడతారు.

Delhi Liquor Scam: తాను అవినీతిపరుడైతే లోకంలో నిజాయిపరులే ఉండరట.. కేజ్రీవాల్ చిత్రమైన వ్యాఖ్యలు

5 నుంచి 7 లగ్జరీ కార్లు.. 20 వేల చదరపు అడుగుల స్థలం, 30 లక్షలు ఖరీదు చేసే టీవీ, 24 గిర్ జాతికి చెందిన పశువులు ఇదంతా మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు ఇన్ ఛార్జి అసిస్టెంట్ ఇంజనీర్ హేమ మీనా అవినీతి చిట్టా లిస్టు. ఇంకా 100 కుక్కలు, మొబైల్ జామర్లు, ఇంకా విలువైన వస్తువులు ఈ లిస్టులో ఉన్నాయి.

అవినీతి నిరోధక అధికారులు జరిపిన దాడుల్లో హేమా మీనా ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. ఖరీదైన వస్తువులతో పాటు తన ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబంధించిన వస్తువులు కూడా ఈమె ఉపయోగించినట్లు తెలుస్తోంది. హార్వెస్టర్లతో పాటు కొన్ని వ్యవసాయ యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Corrupt Officer : బీహార్‌ అవినీతి అధికారి ఇంట్లో డ‌బ్బే..డ‌బ్బు-లెక్కపెట్టడానికి గంటల సమయం

సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేసే నెపంతో లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ (SPE) బృందం హేమా మీనా ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించింది. కేవలం ఒకే రోజులో రూ. 7 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు బయట పెట్టారు. హేమపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.