యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

  • Published By: venkaiahnaidu ,Published On : October 30, 2020 / 05:07 PM IST
యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

Updated On : October 30, 2020 / 5:45 PM IST

target hit by Anti-Ship missile (AShM) fired by Indian Navy యాంటీ షిప్ మిసైల్‌(AShM)ను భారత నేవీ విజయవంతంగా ప్రయోగించింది. శుక్రవారం బంగాళాఖాతంలో INS కోరా మీద నుంచి ఈ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత దూరంలో ఉన్న టార్గెట్‌‌ను కూడా ఈ మిసైల్ కచ్చితంగా ఛేదించింది. టార్గెట్‌ను గురి పెట్టి మిసైల్‌ను ఫైర్ చేసిన ఫొటోలతో పాటు, టార్గెట్ షిప్‌ కు కచ్చితంగా ఆ మిసైల్ తగలడం, అది మంటల్లో కాలిపోతున్న ఫొటోలను,వీడియోను ఇండియన్ నేవీ ట్విట్టర్ లో షేర్ చేసింది.



కాగా,ఇటీవల అరేబియా సముద్రంలో INS Prabhal పై నుంచి జరిపిన క్షిపణి ప్రయోగం కూడా విజయవంతం అయింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే ఇండియన్ నేవీ ట్విట్టర్ లో షేర్ చేసిన విషయం తెలిసిందే.



మరోవైపు, త్రివిధ దళాలను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌‌కు ఆయుధ సంపత్తిని సమకూరుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్‌’తీసుకొచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా రక్షణ శాఖ అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి కలిపి మొత్తం 101 రకాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.



రక్షణ శాఖ ఆంక్షలు విధించిన 101 వస్తువుల జాబితాలో.. ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, సోనార్ సిస్టమ్స్, ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్టులు, లైట్ వెహికల్స్, రాడార్ల వంటి కీలక సంపత్తి కూడా ఉండటం గమనార్హం. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు విపరీతంగా అవకాశం కల్పించడం, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలకు ఎక్కువ ధర చెల్లించారనే విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విదేశీ వస్తువుల దిగుమతలుపై మోడీ సర్కార్ ఆంక్షలు విధించడం కీలకంగా మారింది.