Aravind Kejriwal : పంజాబ్ లో రెండో వాగ్దానాన్ని ప్రకటించిన కేజ్రీవాల్

పంజాబ్ లో పాగా వేయడమే లక్ష్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీలు వర్షం కురిపించారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో రెండో వాగ్ధానాన్ని ప్రకటించారు.

Aravind Kejriwal : పంజాబ్ లో రెండో వాగ్దానాన్ని ప్రకటించిన కేజ్రీవాల్

Kejrival

Updated On : September 30, 2021 / 3:07 PM IST

Kejriwal announces second promise : పంజాబ్ లో పాగా వేయడమే లక్ష్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీలు వర్షం కురిపించారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో రెండో వాగ్ధానాన్ని ప్రకటించారు. పంజాబ్ ప్రజలకు ఉచిత వైద్యం హామీ ఇచ్చారు. ఇప్పటికే 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ తోపాటు 24 గంటల పాటు కరెంట్ అందిస్తామని ప్రకటించారు. నేడు రెండో వాగ్దానాన్ని కేజ్రీవాల్ ప్రకటించారు. సమయం వచ్చినప్పుడు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తామని చెప్పారు.

సిద్ధూ ఆప్ లో చేరబోతున్నారనే వార్త ప్రస్తుతానికి కల్పితమేనని..అలాంటిదేదైనా ఉంటె ముందు మీకే చెప్తామని పేర్కొన్నారు. చరణ్ జిత్ సింగ్ చన్ని మమ్మల్ని కాపీ కొడుతున్నారని విమర్శించారు. తనను కాపీ కొట్టడం సులభమే, కానీ తాను చేసిన పనులను అమలు చేయడమే కష్టమన్నారు. తన సహచర మంత్రిపై ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయడమే కాదు, కేసును సీబీఐ అప్పగించానని గుర్తు చేశారు. కానీ చన్ని క్యాబినెట్ లో ఆరోపణలు వచ్చిన వారు ఉన్నా చర్యలు లేవన్నారు.

Amarinder Singh : G-23 కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్న కెప్టెన్ సాబ్.. అందుకేనా?

కరోనా టైంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో అంతమందికి రెండు నెలల్లోనే ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కెప్టెన్ అమరేందర్ సింగ్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చి నిలుపుకోలేదని విమర్శించారు. ప్రస్తుత సీఎం చన్ని కెప్టెన్ హామీని నెరవేర్చాలన్నారు.

ఢిల్లీలో అవినీతిని అంతం చేశామని, ఒక్కరూపాయి అప్పులో లేదని స్పష్టం చేశారు. ప్రయివేట్ హాస్పిటల్ లో ఎలాంటి చికిత్సలు అందుతాయో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అంతే మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు. మందులు, టెస్టులు, ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. 10 వేల ఖరీదైన ఇంజెక్షన్లు కూడా ఢిల్లీలో ఉచితంగానే అందిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో అందించినట్లే మంచి వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు.

Punjab Politics : పంజాబ్ పీసీసీ చీఫ్ గా లాల్ సింగ్!

ఢిల్లీలో మాట ఇచ్చినట్లే ఆప్ సర్కార్ నెరవేర్చిందన్నారు. ఇప్పుడు పంజాబ్ ప్రజలకు మాట ఇస్తున్నా, అన్ని రకాల మందులు ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఒకప్పుడు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేసేందుకు మిషిన్లు, టెస్టులు చేసేవాడు ఉండేవారు కాదు, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.

కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డు ఇస్తామని చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసినట్లే పంజాబ్ లో 16 వేల మొహల్లా క్లినిక్ తరహా క్లినిక్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం, కొత్త ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యాక్సిడెంట్ బాధితులకు మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. చిన్న చిన్న నగరాల్లో కూడా ప్రెస్ క్లబ్ లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.