Army Chief Gen Manoj Pande: సరిహద్దు ప్రాంతాల్ని సందర్శించిన ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే.. సైన్యానికి కీలక సూచన
ఆర్మీకి సంబంధించి కీలక అంశాల్ని మనోజ్ పాండే పరిశీలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచించారు. భద్రత, సన్నాహక ఏర్పాట్లు, సైన్యం మోహరింపు, కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు.

Army Chief Gen Manoj Pande: భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ఇటీవల ఉత్తర అరుణాచల్ సహా వివిధ ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) సరిహద్దు ప్రాంతాల్ని సందర్శించారు. ఈ సందర్భంగా సైన్యానికి కీలక సూచనలు చేశారు. శనివారం మజోజ్ పాండే అరుణాచల్ ప్రదేశ్, కోల్‌కతాలోని కమాండ్ హెడ్‌క్వార్టర్స్ వంటి ప్రాంతాల్ని సందర్శించినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.
Karimnagar: కరీంనగర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి 11 రోజులపాటు వేడుకలు
ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పర్యటనలో ఆర్మీకి సంబంధించి కీలక అంశాల్ని మనోజ్ పాండే పరిశీలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచించారు. భద్రత, సన్నాహక ఏర్పాట్లు, సైన్యం మోహరింపు, కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు. గట్టి నిఘా ఏర్పాటు చేస్తూ, అప్రమత్తంగా ఉంటున్నందుకు సైన్యాన్ని ఆయన అభినందించారు. నిరంతరాయంగా, ఉత్సాహంతో పని చేస్తున్నారని సైనికుల్ని ప్రశంసించారు. సరిహద్దు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల ఇండియా-చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. భారత-చైనా సైనికులకు మధ్య ఆరు వారాల క్రితం ఘర్షణ జరిగింది.
Viral Video: బైక్‌పై విచ్చలవిడిగా ప్రవర్తించిన జంట.. పోలీసులు ఏం చేశారంటే
ఈ ఘటన నేపథ్యంలో మనోజ్ పాండే సరిహద్దులో పర్యటించి, సైన్యం పరిస్థితిని అంచనా వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా సరిహద్దులో మన సైన్యాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సరిహద్దులకు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడంతోపాటు, ఆయుధ సామగ్రిని కూడా పెంచుకుంటోంది. సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో సైన్యాన్ని మోహరించేందుకు తగినట్లుగా ఆర్మీ సిద్ధమవుతోంది.