టార్గెట్ పీవోకే.. సైన్యం సిద్ధంగా ఉంది: ఇండియన్ ఆర్మీ చీఫ్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఉన్న ప్రాంతాలను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇండిన్ ఆర్మీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పీవోకే వంటి కీలకమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, దేశ వ్యవస్థలుమ మొత్తం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాయని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం నిర్ణయాలను అమలు చేసేందుకు ఆర్మీ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని రావత్ వెల్లడించారు.
అలాగే కశ్మీర్ ప్రాంత ప్రజలు శాంతిని నెలకొల్పేందుకు ఆర్మీకి సహకరించాలని బిపిన్ రావత్ కోరారు. అనేక ఏళ్లుగా ఉగ్రవాదానికి కశ్మీర్ ప్రజలు బలయ్యారని, ఇప్పుడు అక్కడి ప్రజలు శాంతిని నెలకొల్పేందుకు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని రావత్ కోరారు. పీవోకే ప్రాంతాలను భారత్‌లో కలుపాలనే తీర్మానాన్ని 1994లో పార్లమెంట్ ఆమోదించిందని, అప్పటి ప్రధాని నర్సింహారావు ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో కేంద్రం తర్వాతి టార్గెట్ పీవోకే స్పష్టం అయినట్లు వార్తలు వచ్చాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కూడా ఇటీవల పీవోకే గురించి పాకిస్తాన్ తో చర్చలు జరుపుతామంటూ చెప్పిన సంగతి తెలిసిందే.