Army Jawan: ఆర్మీ జవానుపై దుండగులు దాడి చేసి వీపుపై…

తన వద్దకు వచ్చిన దుండగులు మొదట తన చేతులను కదలకుండా టేపుతో కట్టేశారని ఆ జవాను చెప్పారు.

Army Jawan: ఆర్మీ జవానుపై దుండగులు దాడి చేసి వీపుపై…

Army Jawan

Army Jawan – PFI: భారత ఆర్మీ జవానుపై కేరళ(Kerala)లో కొందరు దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. ఆ జవాను వీపుపై పీఎఫ్ఐ అని ఆకుపచ్చ పెయింట్ తో రాసి పారిపోయారు ఆ దుండగులు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ ఘటనపై బాధిత జవాన్ షైన్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. తన ఇంటి పక్కనే ఉన్న రబ్బర్ ఫారెస్టు వద్దకు వచ్చిన ఆరుగురు వ్యక్తుల గ్యాంగ్ తనపై దాడి చేసిందని చెప్పారు. తన వద్దకు వచ్చిన దుండగులు మొదట తన చేతులను కదలకుండా టేపుతో కట్టేశారని చెప్పారు.

ఆకుపచ్చ రంగు పెయింట్‌తో తన వీపుపై పీఎఫ్ఐ అని రాసి వెళ్లారని తెలిపారు. పీఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఈ ఇస్లామిక్ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించింది. జవానుపై దాడి చేసింది పీఎఫ్ఐ సభ్యులేనా అన్న విషయంపై పోలీసుల నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ కేసులో నిజానిజాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Viral Video: రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన వజ్రాలు.. వీడియో చూడండి, జనాలు ఎలా ఎగబడ్డారో?